Begin typing your search above and press return to search.
కరోనా కేసులు డబుల్ అయితే... మనం హ్యాండిల్ చేయగలమా?
By: Tupaki Desk | 13 May 2020 8:00 AM ISTనిజమే... భారత ప్రజలనే కాకుండా యావత్తు ప్రపంచ దేశాల ప్రజలను హడలెత్తిస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి... ఎంతమేర కట్టడి ప్లాన్లు అమలు చేస్తున్నా... తనదైన శైలిలో విస్తరించుకుంటూనే సాగుతోంది. అసలు ఆయా దేశాల ప్రభుత్వాలు చేస్తున్న కట్టడి చర్యలు తనను ఏమాత్రం నిలువరించలేవన్న దిశలో కరోనా విస్తరిస్తున్న వైనం నిజంగానే మనలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోందనే చెప్పక తప్పదు. ఇదంతా ఒక ఎత్తు అయితే... ప్రస్తుత కరోనా విస్తృతిని కాస్తంత లోతుగా పరిశీలిస్తే.. ప్రస్థానం మొదలైన రోజుల్లో మాదిరిగా కరోనా చాలా నెమ్మదిగా విస్తరించడం లేదు. జెట్ స్పీడుతో పెరుగుతున్న దాని విస్తృతిని చూస్తుంటే... 10 రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కరోనా కేసులు డబుల్ అయిపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికే 60 వేల మార్కును దాటిన బారత్... మరో పది రోజుల్లో ఈ కేసులు మరోమారు డబుల్ అయితే, ఆ తర్వాత మరో పది రోజుల్లో మరోమారు డబుల్ అయితే... పరిస్థితి ఏమిటి? అనేది ఊహించడానికే భయం పుట్టించేలా ఉంది.
ఇలాంటి నేపథ్యంలో ఆ డబ్లింగ్ లెక్కలే నిజమయ్యే పరిస్థితి వస్తే... కరోనాపై మన పోరాటం ఏ స్థాయిలో ఉండాలన్న దానిపై ఓ ఆసక్తికర విశ్లేషణ బయటకు వచ్చింది. ఈ విశ్లేషణ ప్రకారం... కరోనా ఏ మేర విస్తరిస్తుందో? ఆ మేర వైద్య సదుపాయాలను పెంచడం తప్పనిసరి. మరి ఆ దిశగా... అంటే కరోనా విస్తరణతో పోటీ పడి మనం పరుగెత్తగలమా? అన్నది నిజంగానే భయాందోళన కలిగించే అంశమే. సరే.. మరి ముందుగా భయాందోళనలను పక్కనపెట్టేసి... కరోనాతో కలిసి పోరాడగలిగేందుకు భారత్ కు అవసరమైన సాధన సంపత్తి ఏ మేర ఉండాలన్న దాని వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
ప్రస్తుతం 60 వేల మార్కును దాటిన కరోనా కేసులు... ఓ 8 రోజుల్లో డబుల్ అయిపోయే పరిస్థితి వస్తే... జూలై చివరి నాటికి దేశంలో 7.66 కోట్ల కరోనా కేసులు నమోదు అవుతాయి. అలా కాకుండా కేసుల డబ్లింగ్ కు 8 రోజులు కాకుండా 10 రోజులు పడితే... జూలై 31 నాటికి 1.85 కోట్ల కేసులు నమోదు అవుతాయి. కేసుల డబ్లింగ్ కు 12 రోజుల సమయం పడితే... జూలై 31 నాటికి దేశంలో కేసుల సంఖ్య 71 లక్షలకు చేరుకుంటుంది. మొత్తంగా దేశంలో శరవేగంగా కరోనా విస్తరిస్తున్న తీరు చూస్తే... ఈ తరహాలో కేసుల పెరుగుదల తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా నమోదైన 60 వేల కేసులకు చికిత్స అందించేందుకే నానా అవస్థలు పడుతున్న భారత్... మరి పైన చెప్పిన గణాంకాల మేర కేసులు డబ్లింగ్ అయిపోతే ఏం చేస్తుందన్నది నిజంగానే ఆసక్తికరం.
కేసుల సంఖ్య ఈ మేర పెరిగితే... .జూలై చివరి నాటికి మనకు ఏమేం కావాలన్న విషయంలోనూ పై విశ్లేషణ ఓ అంచనాను వేసింది. కేసుల సంఖ్య పది రోజులకు డబుల్ అవుతుందనుకుంటే... ఈ అంచనా ప్రకారం జూలై 31 నాటికి 47.4 కోట్ల పీపీఈ కిట్స్ - 42 కోట్ల ఐసోలేషన్ బెడ్లు - 2.77 లక్షల ఐసీయూ బెడ్లు - 77 వేల వెంటిలేటర్లు కావాలి. అదే సమయంలో కేసుల సంఖ్య 8 రోజులకే డబుల్ అవుతుందనుకుంటే... 196.5 కోట్ల పీపీఈ కిట్లు - 1.74 కోట్ల ఐసోలేషన్ బెడ్లు - 12 లక్షల ఐసీయూ బెడ్లు - 3.2 లక్షల వెంటిటేలర్లు కావాల్సి ఉంది. ప్రస్తుతం 60 వేల కేసులు నమోదైన తరుణంలో మనం ఏ మేర వీటిని వినియోగిస్తున్నామన్న విషయానికి వస్తే... దేశవ్యాప్తంగా 19లక్షల ఐసోలేషన్ బెడ్లు - 95 వేల ఐసీయూ బెడ్లు - 47, 500 వెంటిలేటర్లను సిద్ధం చేసుకున్నాం. ఒక్క వెంటిలేటర్ల విషయంలోనే మన పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉన్నా.. మిగిలిన ఏ ఒక్క విషయంలోనూ మనం కరోనాతో సరిసమానంగా వేగంగా పరుగెత్తే సామర్థ్యం లేదనే చెప్పాలి. మరి కరోనా డబుల్ మీద డబుల్ అయిపోతే మన పరిస్థితి ఏమిటో... ఈ అంచనానే చెబుతోంది.