Begin typing your search above and press return to search.

మైనర్ భార్యతో సెక్స్ నేరం కాదెలా?

By:  Tupaki Desk   |   6 Jan 2017 4:54 AM GMT
మైనర్ భార్యతో సెక్స్ నేరం కాదెలా?
X
చట్టాలు కాస్త చిత్రంగా కనిపిస్తుంటాయి. ఒక విషయానికి సంబంధించి ఒకచోట కచ్ఛితంగా పేర్కొన్న అంశం.. మరో దగ్గర అలాంటిది లేకుండా ఉండటమే కాదు.. విస్మయకర అంశాలు ఉండటం కనిపిస్తుంది. అయితే.. ఇందుకు లోతైన అధ్యయనం తప్పనిసరి. ఇలా చేసిన వారికి చట్టంలోని లోపాలు ఇట్టే కనిపిస్తాయి. తాజాగా అలాంటి లోపాన్ని గుర్తించారు నోబెల్ బహుమతి గ్రహీత.. స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు కైలాశ్ సత్యార్థి.

ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ చేస్తే నేరం కాదని చెబుతోందని.. అదే సమయంలో పద్దెనిమిదేళ్ల బాలికతో బలవంతపు సెక్స్ చేస్తే.. పదేళ్లు శిక్ష పడేంత తీవ్రమైన నేరమని లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం చెబుతోంది. మరీ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని సరిదిద్దాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు కైలాశ్ సత్యార్థి.

ఆయన లేవనెత్తిన ధర్మ సందేహం సబబేనని.. ఆయన లాజిక్ ను నిజమేనని అంగీకరించింది అత్యున్నత న్యాయస్థానం. సత్యార్థి లేవనెత్తిన అంశంపై కేంద్రం స్పందించాలని.. తన అభిప్రాయాన్ని నాలుగు నెలల వ్యవధిలో వెల్లడించాలని చెబుతూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరీ.. అంశంపై కేంద్రం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. చట్టంలోని ఇలాంటి వైరుధ్యాలు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/