Begin typing your search above and press return to search.

ప్రాణాంతక వైరస్​లు కాలగర్భంలో కలిసిపోతాయా.. నిజమెంతా?

By:  Tupaki Desk   |   25 Sept 2020 8:00 AM IST
ప్రాణాంతక వైరస్​లు కాలగర్భంలో కలిసిపోతాయా.. నిజమెంతా?
X
కరోనా లాంటి ప్రాణాంతక వైరస్​ లు కొంతకాలానికి వాటంతటే అవే కాలగర్భంలో కలిసిపోతాయా? మనుషులపై వాటి ప్రభావం ఏమాత్రం ఉండదా? గతంలోనూ కొన్ని రకాల వైరస్​ లు విజృంభించి వాటంతట అవే లేకుండా పోయాయా? కరోనా వైరస్​ కూడా అలాగే అంతరించి పోనున్నదా.. దీనిపై చరిత్ర ఏం చెబుతోంది. గతంలో మానవాళిని వణికించిన వైరస్​ లు ఏమయ్యాయి తెలుసుకుందాం.. ఒకప్పుడు స్మాల్​ఫాక్స్​ ప్రపంచాన్ని వణికించింది.. ఈ వైరస్​తో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 1970లో ఈ వైరస్​ కు వ్యాక్సిన్​ వచ్చింది. దీంతో ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే స్మాల్​ఫాక్స్​ వైరస్​ అంతకు కొన్ని దశాబ్దాల ముందే పుట్టి ఓసారి అంతరించి పోయిందని.. ఆతర్వాత 19 వ శతాబ్ధం లో మళ్లీ పుట్టిందని కొన్ని ఆధారాలు లభించాయి. అయితే కొంతకాలం పాటు మనవాళిని ఉక్కిరి బిక్కిరి చేసిన సార్స్​ వైరస్​ కూడా దానంతట అదే అంతరించి పోయింది.

చైనాలో అడవి జంతువుల మాంసంలో పుట్టిన ఈ వైరస్​ దాదాపు 8000 మందికి సోకింది. 774 మంది చనిపోయారు. 2004 జనవరి నాటికి పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఇప్పడు మనవాళిని వణికిస్తున్న కరోనా వైరస్​ కూడా అంతరించి పోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మరికొందరు శాస్త్రవేత్తలు కరోనా విషయంలో ఇటువంటి అంచనాలు సరికాదని చెబుతున్నారు. ఈ వైరస్ వాస్తవంగా గబ్బిలాల్లో ఉంటుందని.. అది మరో జంతువుకు బహుశా పాంగోలిన్లకు సోకి.. వాటి నుంచి మనుషులకు సోకి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల కరోనా వైరస్​ అంత తొందరగా అంతరించి పోదని కొందరి భావన. అయితే దీనిపై శాస్త్రవేత్తల అధ్యయనాలు ఎంతమేరకు నిజమవుతాయో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.