Begin typing your search above and press return to search.

మహమ్మారి లెక్కలు తేల్చేందుకు సీసీఎంబీ సరికొత్త ప్రయోగం

By:  Tupaki Desk   |   29 Sept 2020 9:30 AM IST
మహమ్మారి లెక్కలు తేల్చేందుకు సీసీఎంబీ సరికొత్త ప్రయోగం
X
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి ఎన్నో అధ్యయనాలు ఇప్పటివరకు జరిగాయి. ఇప్పటికి జరుగుతున్నాయి కూడా. తాజాగా హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సింపుల్ గా చెప్పాలంటే సీసీఎంబీ శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్నసందేహాలు.. కొన్ని వాదనల్లో పస ఎంతో తేల్చేందుకు వారు సిద్ధమయ్యారు. వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా? అదే జరిగితే ఎంత దూరం మేర విస్తరిస్తోంది? దీని ప్రమాద తీవ్రత ఎంత? పాజిటివ్ అయిన వారి కారణంగా ఎంత దూరం మహమ్మారి విస్తరిస్తోంది? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని వెతికే ప్రయత్నం చేస్తోంది.

గాలిలో వైరస్ వ్యాపిస్తుందనటానికి సరైన ఆధారాలు లేనప్పటికి.. దాదాపు 200లకు పైగా శాస్త్రవేత్తలు మాత్రం గాల్లో వైరస్ వ్యాప్తి చెందుతోందన్న విషయానికి తేల్చేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. ఇదే సమయంలో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ కూడా గాల్లో వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చన్న విషయాన్ని కొట్టిపారేయలేమని పేర్కొంది. ఈ నేపథ్యంలో తమదైన అధ్యయనం చేసేందుకు వీలుగా సీసీఎంబీ తాజాగా రంగంలోకి దిగింది.

తాజాగా సీసీఎంబీ చేపట్టే అధ్యయనంలో భాగంగా కరోనాకు చికిత్స చేసే ఐసీయూలోని గాల్లో ఏ మేర వైరస్ వ్యాప్తి చెందుతుందన్న విషయాన్ని గుర్తిస్తారు. గాల్లో ఎంతసేపు మనగుడలో ఉందన్న విషయాన్ని లెక్క తేల్చనున్నారు. అనంతరం జనం గుంపులుగా ఉన్న ప్రాంతాల్లో ఈ సర్వే చేయిస్తామని.. పది రోజుల్లో దీనిపై అవగాహనకు రానున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగం కోసం ప్రత్యేకంగా యంత్రాల్ని తీసుకొచ్చారు. తాము చేసే ఈ ప్రయోగంతో వైద్యులు.. ఆరోగ్య సిబ్బందితోపాటు.. ఇతరులకు ఎంతో మేలు జరుగుతుందని సీసీఎంబీ భావిస్తోంది.