Begin typing your search above and press return to search.

సహజీవనం చేస్తే పోక్సో కింద శిక్షించవచ్చా?

By:  Tupaki Desk   |   29 March 2021 8:00 AM IST
సహజీవనం చేస్తే పోక్సో కింద శిక్షించవచ్చా?
X
సహజీవనంలో ఉంటూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న వారిపై పోక్సో చట్టం కింద శిక్ష విధించాలా? వద్దా అనే అంశంపై స్పందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

తమిళనాడుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే ఆ తర్వాత వివాహానికి నిరాకరించడం వల్ల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై అత్యాచారం కేసు నమోదైంది.

తనపై అత్యాచారం జరగలేదని.. ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో యువతి వెల్లడించింది. తిరిగి ఆ యువకునితో కలిసి జీవించడానికి సుమఖంగా ఉన్నట్లు తెలిపింది.

యువతి వాదనలను తిరస్కరించిన దిగువ కోర్టు పోక్సో చట్టాన్ని అనుసరించి యువకుడికి 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధించింది. యువతికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది.

ఇక కాంప్రమైజ్ అయిన యువతీ యువకులు మద్రాస్ హైకోర్టు ఎదుట తాము పరస్పరం అంగీకారంతో సహజీవనం చేశామని సాక్ష్యమిచ్చారు. ఆ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఆమె పిటీషన్ను తోసిపుచ్చింది. పిటీషన్ ను కొట్టివేసింది.

దీంతో యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు తీర్పుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.