Begin typing your search above and press return to search.

మోడీ కేబినెట్‌లో ఏపీకి చోటు ద‌క్కేనా?.. ఢిల్లీ వ‌ర్గాల మాటిదే!

By:  Tupaki Desk   |   28 Jun 2021 1:40 AM GMT
మోడీ కేబినెట్‌లో ఏపీకి చోటు ద‌క్కేనా?.. ఢిల్లీ వ‌ర్గాల మాటిదే!
X
త్వ‌ర‌లోనే కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న ఉంటుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రో మూడేళ్ల‌పాటు.. అధికా రంలో ఉండే.. మోడీ.. వ‌చ్చే ఏడాదిని కీల‌కంగా తీసుకుంటున్నారు. ఒక‌టి ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు, రెండు రాష్ట్రప‌తి ఎన్నిక‌. ఈ రెండు ప‌రిణామాల నేప‌థ్యంలో కేంద్ర కేబినెట్‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డంద్వారా.. ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తు న్న‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో జ‌మ్ము క‌శ్మీర్ విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యంపై మోడీ అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు. ఈ క్ర‌మంలో అక్క‌డ కూడా ఆయ‌న త‌న‌కు సానుకూల ప‌వ‌నాలు వీచేలా చేసుకునేందుకు కేబినెట్ విస్త‌ర‌ణ‌ను ఆయుధంగా మ‌లుచుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కేంద్ర మంత్రులు లోక్ జనశక్తి పార్టీ చీఫ్ రామ్ విలాస్ పాసవాన్‌, కర్ణాటక బీజేపీ నాయకుడు సురేశ్ అంగడి మరణంతో కేబినెట్ విస్తరణకు అవకాశం ఏర్పడింది. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు శిరోమణి అకాలీదళ్, శివసేన నాయకులు ఖాళీ చేసిన రెండు మంత్రి పదవులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. కేంద్రమంత్రి వర్గంలోని పలువురు... అదనపు బాధ్యతలను కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో... వీటిని కొత్త వారికి అప్పగించి కేబినెట్‌ హోదా కల్పించాలని మోడీ యోచిస్తున్నారు. ఇక‌, ఇప్ప‌టికే ఉన్న మంత్రుల్లో ఆశించిన ఫ‌లితాలు రాబ‌ట్టని వారిని కూడా మారుస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

అయితే.. ప్ర‌ధానంగా.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని మార్పు భారీగానే ఉంటుంద‌ని.. స‌హాయ మంత్రుల‌ను ఎక్కువ మందిని తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు రెండు మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అదేస‌మయంలో ఏపీ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయితే.. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎవ‌రూ విజ‌యం సాధించ‌లేదు. అయితే.. రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్న ఏపీకి చెందిన జీవీఎల్‌కు స‌హాయ మంత్రి ప‌ద‌వి ఇచ్చి.. ఏపీలో పార్టీ పున‌రుజ్జీవానికి మోడీ ప్రాధాన్యత ఇస్తార‌ని అంటున్నారు. ఇదేవిష‌యంపై ఇటీవ‌ల జ‌రిగిన బీజేపీ అధిష్టానం చ‌ర్చ‌లోనూ ఒక తీర్మానం చేసిన‌ట్టు తెలుస్తోంది. అంటే.. మొత్తంగా కేబినెట్‌లో ఏపీకి ఈ ద‌ఫా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అయితే.. స‌హాయ మంత్రిప‌ద‌విని మించ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.