Begin typing your search above and press return to search.
టీఆర్ఎస్ లో ఉద్యమకారులు మంత్రులు కాలేరా..?
By: Tupaki Desk | 9 April 2021 10:00 PM ISTరాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న సామెత ఇప్పుడు నిజమేనన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడి.. కేసీఆర్ వెన్నంటే ఉన్నవాళ్లకు అన్యాయం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాడు గొంతెత్తింది. ప్రాణం మీదకు తెచ్చుకొని మరీ కేసీఆర్.. ఆయనకు తోడుగా కోదండరాం జేఏసీ వీరోచితంగా పోరాడింది. ఇందులో భాగంగా 2009లో కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేసి చివరికి యూపీఎ-2 గవర్నమెంట్ చేత తెలంగాణ పై ప్రకటన చేయించారు.
ఆ సమయంలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉండి తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉండడమే కాకుండా వీరి పోరాటాన్ని హేళన చేశారు. అయితే ఇప్పుడు వారే ఉన్నత పదవుల్లో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వారిని వెనక్కి నెట్టేశారని అంటున్నారు. కేసీఆర్ దీక్ష చేస్తున్న సమయంలో ఆయనతో ఉన్న ఎమ్మెల్యేలు, కోదండరాం లాంటి పెద్ద మనుషులు, ఉస్మానియా విద్యార్థులను ఇప్పుడు కేసీఆర్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమం గురించి ఏమాత్రం పట్టించుకోని ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్ లు ప్రస్తుతం మంత్రి పదవుల్లో కొనసాగుతున్నారు. వీళ్లు ఏమాత్రం తెలంగాణ కోసం పోరాడిన దాఖలాలు లేవని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో వీరు ఇతర పార్టీల్లో ఉంటూ పదవులు అనుభవించారని, ఇప్పుడు కూడా వారికి అత్యున్నత పదవులు ఇచ్చి కేసీఆర్ వారికి న్యాయం చేసి, తెలంగాణ కోసం పోరాడిన వారికి అన్యాయం చేస్తున్నారని అంటున్నారు.
వచ్చే ఎలక్షన్ వరకైనా ఈ విషయంపై దృష్టి పెట్టకపోతే టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పదని కొందరు రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి విషయంపైనే కొంత వ్యతిరేకత వచ్చిందంటున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొన్ని వర్గాల ఓట్లు మాత్రమే ఉండడంతో వారిని కేసీఆర్ మచ్చిక చేసుకోవడంతో గెలుపొందారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు పరిస్థితి ఇలాగే ఉంటే టీఆర్ఎస్ లో మార్పులు ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు.