Begin typing your search above and press return to search.
నమ్మిన వారికి అందలమెక్కిస్తున్న జోబైడెన్
By: Tupaki Desk | 17 Nov 2020 11:30 PM ISTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ విజయం సాధించడం వెనుక జెన్ ఓ మాల్లీ డిల్లాన్ కీరోల్ పోషించారు. ఆమెకు తాజాగా జోబైడెన్ కీలక పదవి అప్పగించడానికి రెడీ అయ్యారని సీఎన్ఎన్ న్యూస్ తెలిపింది. వైట్ హౌస్ నియామకాలకు సంబంధించి జోబైడెన్ దృష్టి సారించారని పేర్కొంది.
జోబైడెన్ క్యాంపెయిన్ మేనేజర్ గా జెన్ ఈ ఎన్నికల్లో కీలక ప్రచారం చేశారు. బిడెన్ కు ప్రచారంలో రాజకీయ శత్రువల నుంచి మాటల యుద్ధాలను తిప్పికొట్టడంలో జెన్ వ్యూహాలు బాగా పనిచేశాయని పేరు వచ్చింది.
అయితే గత వారం మాత్రం చీఫ్ ఆఫ్ స్టాఫ్ పోస్టులో రాన్ క్లెయిన్ పేరు వినిపించింది. ఆమెను చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఎంపిక చేశారు. క్లెయిన్ కు డిప్యూటీగా జెన్ వ్యవహరించనున్నట్టు తెలిసింది.
సాధారణ ఉద్యోగి అయిన జెన్ గత మార్చిలో జోబైడెన్ టీంలో చేరారు. ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు. ఇప్పుడు వైట్ హౌస్ లో కీలక పదవి దక్కించుకోబోతున్నారు.