Begin typing your search above and press return to search.

టీడీపీకి ఓటు వేయాలని ట్విట్టర్లో పిలుపా ?

By:  Tupaki Desk   |   30 Nov 2020 10:00 AM IST
టీడీపీకి ఓటు వేయాలని ట్విట్టర్లో పిలుపా ?
X
చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి ఓటు వేయాలంటూ ట్విట్టర్లో పిలుపిచ్చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ప్రచారం కోసం చంద్రబాబు కనీసం ఇంట్లో నుండి కాలు బయటకు పెట్టలేదు. అలాంటిది ఆదివారంతో ప్రచారం ముగిసిన తర్వాత ట్విట్టర్ వేదికగా ఓటర్లకు పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. పైగా మాటలు కాకుండా చేతల్లో అభివృద్దిని చూపామని, హైదారబాద్ డెవలప్ అయ్యిందంటే టీడీపీ వల్లే అని చెప్పుకున్నారు.

చంద్రబాబు చూపించిన అభివృద్ది ఏమిటయ్యా అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయటం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం, జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేయటమట. చంద్రబాబు చెప్పుకుంటున్న పై మూడింటిలోనూ టీడీపీ పాత్ర ఉంది. కానీ మొత్తం టీడీపీ పాత్రే అని చెప్పలేం. ఎందుకంటే తెచ్చింది చంద్రబాబే అయినా నిర్మాణం పూర్తి చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. జినోమ్ వ్యాలీ కూడా తానే డెవలప్ చేశానని చంద్రబాబు చెప్పుకోవటం మాత్రం కరెక్టే. ఎందుకంటే అప్పట్లో బయోటెక్నాలజీ ఇంకా అంత పెట్టుబడులు పెట్టేంత ఊపు లేనపుడే దాని గురించి ఆలోచించగలిగారు.

అప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో బాగా పాపులరైన ఫార్మా కంపెనీలు+ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడిందే జినోమ్ వ్యాలీ. అంటే జినోమ్ వ్యాలీ అన్నది ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వమ్యంతో ఏర్పాటైన ప్రాజెక్టు. వారిని ఏకతాటిపై నడిపించడంలో బాబు సర్కారు బానే కృషిచేసింది. సరే క్రెడిట్ అంటే తన ఖాతాలో వేసుకున్నారు సరే మరి ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రచారానికి వచ్చి ప్రజలకు ఎందుకు చెప్పలేదు ?

తాను ప్రచారానికి వస్తే మళ్ళీ ఆంధ్రాపార్టీ అంటు ప్రాంతీయ తత్వాన్ని లేవదీస్తాడని భావించారా ? అన్నదే అర్ధంకావటం లేదు. ఏదేమైనా ప్రచార కాలమంతా సక్సెస్ ఫుల్ గా ఇంట్లోనే గడిపేసిన చంద్రబాబు ప్రచారం గడువు అయిపోయిన తర్వాత మాత్రం జనాలకు ట్విట్టర్ ద్వారా పిలుపివ్వటం మాత్రం విచిత్రంగానే ఉంది. మరి చంద్రబాబు పిలుపును ఎంతమంది పట్టించుకుంటారో చూడాల్సిందే.