Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో కాల్ మనీ రచ్చ

By:  Tupaki Desk   |   17 Dec 2015 6:18 AM GMT
ఏపీ అసెంబ్లీలో కాల్ మనీ రచ్చ
X
అనుకున్నదే జరిగింది. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యాయి. గత వారంగా రచ్చ రచ్చగా మారిన కాల్ మనీ వ్యవహారం అసెంబ్లీ సమావేశాల్ని రచ్చ రచ్చగా మార్చేశాయి. కాల్ మనీ వ్యవహారంపై ఏపీ విపక్షం వాయిదా తీర్మానాన్ని ఇవ్వటం దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించటం జరిగింది. బీఏసీ సమావేశంలో శుక్రవారం కాల్ మనీ వ్యవహారం మీద చర్చించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇవాళ వదిలేయాలన్నారు.

అయితే.. ఈ వాదనను ఏపీ విపక్ష నేతలు అంగీకరించలేదు. అధికారపక్షం తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు.. వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తూ.. శుక్రవారం ఆ అంశం మీద చర్చ జరుపుదామన్న నేపథ్యంలో విపక్ష నేత జగన్ కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ విపక్షంపై విరుచుకుపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను కూడా ఏపీ సర్కారు వాడేసుకుందంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ అధికారపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

జగన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి యనమల రామకృష్ణుడు.. జగన్ కు సభా కార్యక్రమాల్ని ప్రతిపక్ష నేత ఎలా వ్యవహరించాలో తెలీక ఇలా చేస్తున్నారని.. లోక్ సభలో అంబేడ్కర్ మీద రెండు రోజులు ప్రత్యేకంగా చర్చ జరిపారని..ఇదే రీతిలో ఏపీ అసెంబ్లీలో ఇదే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని భావిస్తే.. జగన్ మాత్రం తమను తప్పు పడుతున్నారంటూ మండిపడ్డారు.