Begin typing your search above and press return to search.

అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి

By:  Tupaki Desk   |   13 Sept 2018 3:59 PM IST
అమెరికాలో కాల్పులు.. ఐదుగురి మృతి
X
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగుడు తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు అమయాకులు చనిపోయారు. అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా బేకర్స్ ఫీల్డ్ లో చోటుచేసుకుంది. నిందితుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో అతడి భార్య కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.

అయితే నిందితుడు ఈ హత్యలు ఎందుకు చేశాడన్నది తెలియరాలేదు. భార్యతో గొడవ లేదా కుటుంబ సమస్యల నేపథ్యంలోనే ఈ హత్యలకు తెగబడ్డట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

తొలుత బేకర్స్ ఫీల్డ్ లోని ట్రక్కింగ్ కంపెనీ ప్రాంగణానికి నిందితుడు చేరుకొని తన భార్యతో పాటు మరో వ్యక్తిని కాల్పిచంపాడు. అనంతరం మరో వ్యక్తిని వెంబండించి మరి కాల్చిపారేశాడు. తన నివాసానికి చేరుకొని మరో ఇద్దరి ప్రాణాలు తీశాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం అందడం.. వారు రావడంతో తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుల వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.