Begin typing your search above and press return to search.
ట్రంప్ కు వ్యతిరేకంగా గవర్నర్ గళం
By: Tupaki Desk | 31 March 2017 12:55 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో వివాదనికి కారణం అవుతున్న వాటిని వెతకడం కంటే...వివాదం కానీ వాటి గురించి ఆలోచించడం ఉత్తమం అవుతుందేమో! ఎందుకంటే ట్రంప్ నిర్ణయాలపై అమెరికా, ప్రపంచ వ్యాప్తంగా వెలువడుతున్న రియాక్షన్స్ అలా ఉన్నాయి మరి. వలసలు, హెచ్1బీ వీసాలపై ఇన్నాళ్లు ప్రపంచం గగ్గోలు పెట్టాగా ట్రంప్ తాజా నిర్ణయంతో ఇప్పుడు అమెరికన్లు మండిపడుతున్నారు. ఏకంగా గవర్నర్ స్థాయి వ్యక్తులు సైతం ట్రంప్ తీరును తప్పుపడుతున్నారు. గత ఒబామా సర్కారు 'బొగ్గుపై యుద్ధం' పేరుతో అమలు చేసిన స్వచ్ఛ విద్యుత్ చట్టాన్ని (క్లీన్ పవర్ ప్లాన్) అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయటంపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసే ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
ఒబామా ప్రభుత్వం గ్లోబల్ వార్మింగ్ పెరుగుదలకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను తన ప్రభుత్వం రద్దు చేస్తోందని ట్రంప్ ప్రకటించారు. బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు గ్యాస్ ఆధారితంగా మారిపోవటంతో అప్పట్లో కొన్ని బొగ్గు గనులు మూతపడి అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆయన వివరించారు. ఇందుకు సంబంధించిన ఇతర నిబంధనలను కూడా రద్దు చేస్తామని, అయితే స్వచ్ఛమైన గాలి, నీరు సరఫరాకు ఇబ్బంది లేకుండా ఈ చర్యలను అమలు చేస్తామని ట్రంప్ చెప్పారు. అమెరికా విద్యుత్ రంగంపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేసే చారిత్రక నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకున్నదని, ఉద్యోగావకాశాలను హరించే చట్ట నిబంధనలను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. గనుల మూసివేత కారణంగా ఎదురవుతున్న సమస్యలను తమకు తెలియచేయాలని ఆయన ఆయా యాజమాన్యాలకు సూచించారు.
అయితే ఈ చర్యను పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు. స్వచ్ఛ విద్యుత్ ను కాదనటం తప్పు అని, ఇది శాస్త్ర విజ్ఞానాన్ని ధిక్కరించటమే అవుతుందని కాలిఫోర్నియా గవర్నర్ జెర్రీ బ్రౌన్ వ్యాఖ్యానించారు. ప్రకృతి వనరుల పరిరక్షణా మండలి డైరెక్టర్ డేవిడ్ గోల్డ్‌స్టోన్ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణానికి తూట్లు పొడిచేందుకు ప్రజలు ట్రంప్‌ను ఎన్నుకోలేదన్నారు. ఇప్పుడు చేపట్టిన మార్పులు చట్టానికి, శాస్త్ర పరిజ్ఞానానికి అనుకూలంగా ఉన్నాయని నిరూపించాలని ఆయన ట్రంప్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యామ్నాయ ఇందన వనరులను ఉపయోగిస్తుండటంతో ట్రంప్ బొగ్గు విధానం విఫలమవుతుందని ఎర్త్ జస్టిస్ అధ్యక్షుడు ట్రిప్ వాన్ నోపెన్ స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/