Begin typing your search above and press return to search.
టీడీపీ పోరాటాల క్యాలెండర్...గట్టిగానే మరి...?
By: Tupaki Desk | 31 March 2022 9:00 AM ISTప్రజల నెత్తిన పెను భారంగా పన్నులు పడిపోతున్నాయి. కరోనా తరువాత చూస్తే ఆర్ధికంగా వేలాది కుటుంబాలు కునారిల్లాయి. వారికి ఊరట అయితే దక్కడంలేదు. కేంద్రం ఒక వైపు రాష్ట్రం మరో వైపు ఇలా పన్నుల పేరిట పెనంలో అటూ ఇటూ వేపేస్తున్నారు. ఈ మధ్యనే వంట గ్యాస్ ని కేంద్రం పెంచేసింది. వేయి రూపాయలు ఉంటేనే గ్యాస్ బండ ఇంటికి వచ్చేది.
దానికి తోడు అన్నట్లుగా ప్రతీ రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేస్తున్నారు. ఇపుడు రాష్ట్రం వంతు. ఇప్పటికే చెత్త పన్నుతో సహా చాలా రకాల పన్నులు పెంచేసిన ప్రభుత్వం విద్యుత్ పన్నులను కూడా భారీగా పెంచుతోంది. ఆగస్ట్ నుంచి అమలు కానున్న ఈ పన్నులతో ప్రతీ సామాన్య కుటుంబం మీద వంద నుంచి రెండు మూడు వందల రూపాయల అదనపు భారం పడుతుంది.
దాంతో ఏపీలోని విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీని మీద ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఇక టీడీపీ అయితే దశల వారీ ఉద్యమానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించి పోరాటాల కాలెండర్ ని రిలీజ్ చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఇది ఒక సుదీర్ఘ పోరాటంగా మార్చాలని టీడీపీ చూస్తోంది.
విద్యుతు అంటే ఈ రోజు అతి పెద్ద నిత్యావసరం. కరెంట్ లేకపోతే ఏ పనీ జరగదు.అందువల్ల విద్యుతు ఉద్యమం అంటే నిజంగా మొత్తానికి మొత్తం జనాలను కదల్చినట్లు అవుతుంది. అందుకే టీడీపీ ఏదో తూతూ మంత్రంగా దీన్ని చేయాలనుకోవడంలేదు. ఈ ఉద్యమాన్ని చాలాకాలం పాటు సాగేలా ప్రణాళికలు రచిస్తోంది.
అంటే ఇది ఒక విధంగా ఎన్నికల అంశంగా మార్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. విద్యుత్ అంశం తో ఇప్పటికే ఒకసారి టీడీపీ చేయి కాల్చుకుంది. ఆ పార్టీ ఉమ్మడి ఏపీలో పాలన చేసినపుడు విద్యుతు చార్జీల విషయంలో భారీ ఉద్యమమే జరిగింది. 2004లో టీడీపీ అధికారం చేజారడానికి కూడా ఇదే కారణం.
దాంతో ఇపుడు టీడీపీ ఈ అంశాన్ని చాలా కీలకంగా చూస్తోంది. దీని మీద చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు ఇప్పటికి ఏడు సార్లు జగన్ సర్కార్ పెంచేసింది అన్నారు. ఇపుడు ఇంకా మోపలేని విధంగా భారం వేశారని దుయ్యబెట్టారు. దీని మీద పోరాటాలను దశల వారీగా చేస్తామని చెప్పారు.
ఇంకో వైపు జనసేన కూడా జనంతో కలసి పోరాటాలు అంటోంది. ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా దీని మీద వైసీపీ సర్కార్ ని విమర్శించారు. పేదలు, మధ్యతరగతి వర్గాల నడ్డి విరిచేలా ఈ పన్నులు ఉన్నాయని ఆయన అన్నారు మొత్తానికి కరెంట్ షాక్ తో సరైన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు విపక్షం రెడీ అవుతోంది.