Begin typing your search above and press return to search.

బాబు సర్కార్ ను ‘కాగ్’ కడిగిపారేసింది

By:  Tupaki Desk   |   31 March 2017 7:46 AM GMT
బాబు సర్కార్ ను ‘కాగ్’ కడిగిపారేసింది
X
గతంలో మాదిరి పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ విషయమైనా.. సమాచారం ఏదైనా అందరికి అందుబాటులోకి వచ్చేస్తోంది. నిజాన్నిఅరచేతిలో దాచేసి.. మసిపూసి మారేడుకాయ చేసేస్తామంటూ నమ్మే జనాలు ఇప్పుడెవరూ లేరు. గతంలో మాదిరి తమకు అండగా ఉండే మీడియాలో గొప్పలు రాసేస్తే నమ్మే వారెవరూ లేరనే చెప్పాలి. అయినప్పటికీ.. నిత్యం గొప్పలు చెప్పుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తర్వాతే ఎవరైనా.

నోరు తెరిస్తే చాలు.. తన వల్లే ఏపీ ఇలా ఉందంటూ ఆయన చెప్పే మాటలు నిత్యం వినిపిస్తూ ఉంటాయి.మరి.. బాబు చెప్పిన మాటల్లో నిజాలు నేతిబీరలో నేతి చందానేఅన్న విషయాన్ని తాజాగా కాగ్ రిపోర్ట్ తేల్చేసింది. ప్రాజెక్టుల గురించి చెప్పుకోవటం..బాబు మాటలు విన్న కొందరు స్ఫూర్తి పొంది నదుల అనుసంధానం చేసిన చంద్రబాబు సామాన్యుడు కాదంటూ ఆకాశానికి ఎత్తేసే వైనాన్ని చూసినప్పుడు అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. నదుల అనుసంధానం చేసిన తొలి ప్రాజెక్టుగా చెప్పే పట్టిసీమపై కాగ్ కడిగిపారేసింది.

పట్టిసీమను ప్రతికూలప్రాజెక్టుగా కడిగేసిన కాగ్ నివేదిక.. ప్రాజెక్టుపైన ఖర్చు చేసినదానికి.. దాని కారణంగా పొందే ప్రయోజనానికి మధ్య పొంతన లేదని తేల్చింది. పోలవరం కుడికాల్వ డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాకుండా పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని కాగ్ వెల్లడించింది. పట్టిసీమ ప్రాజెక్టుతో పాటు.. ఏపీ సర్కారు చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులలోని లోపాల్ని ఎత్తి చూపించింది.

= అవసరం లేకున్నా పట్టిసీమ నిర్మాణ పద్ధతిని మార్చారు.ఈ కారణంగా అదనంగా పడిన భారం రూ.106 కోట్లు.

=పారిశ్రామిక..గృహ వినియోగదారులను గుర్తించకుండానే పట్టిసీమ పథకాన్నిచేపట్టారు.

= ఇది కూడా ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరిగిపోవటానికి కారణం.

= పట్టిసీమ టెండర్ ప్రీమియం గరిష్ఠ పరిమితిని కూడా సడలించారు. అధిక ధరలతో టెండర్లను ఒప్పుకున్నారు. దీని వల్ల రూ.199 కోట్ల అదనపు భారం పడింది.

= పైపుల మీద రాయితీ ఉన్నా.. సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని కాంట్రాక్టర్ కు తిరిగి చెల్లించారు.

= ఈపీసీ ఒప్పందాల్లో లేని రూల్స్ కారణంగా ప్రభుత్వం మరో రూ.20.62 కోట్లు నష్టపోయింది.

= గురు రాఘవేంద్ర పులికనుక ప్రాజెక్టులో రూ.4.12 కోట్లు ప్రభుత్వం నష్టపోయింది.

= పైపుల సామర్థ్యం తగ్గినా.. మిగిలు అనేది ప్రభుత్వానికి దక్కకుండా పోయింది. సరైన నిర్వహణ.. శ్రద్ధ లేకపోవటంతో ఈ ప్రాజెక్టు ప్రయోజనాలు అందలేదు.

= హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ610లోకాంట్రాక్టర్ లబ్థి కోసం రూ.4.97 కోట్ల మేర ఎక్కువగా చెల్లించారు.

= హంద్రీనీవా సుజల స్రవంతి ప్యాకేజీ 53లో పనుల పరిధి తగ్గినా ప్రభుత్వానికిడబ్బు మిగట్లేదు. రూ.6.47కోట్ల మిగులు ప్రభుత్వ ఖజానాకు చేరలేదు.

= వ్యవసాయ మార్కెట్ యార్డులపని తీరు దారుణంగా ఉంది.99 యార్డుల్ని తనిఖీ చేస్తే 90చోట్ల ఎలాంటి లావాదేవీలు జరగలేదు. వీటిని పర్యవేక్షించటానికి సరైన యంత్రాంగం లేదు.

= పుష్కర ఎత్తోతల పథకం కింద సరైన ఆయుకట్టు ఏర్పాటు కాలేదు. ప్రభుత్వం చెబుతున్న ఆయకట్టు టార్గెట్ చేరుకోవటం లేదు.

= వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తులు లక్షల కొద్దీ పెండింగ్ లో ఉన్నాయి. వయోవృద్ధుల సంక్షేమం కోసం పెద్దగా నిధులు ఇవ్వటం లేదు.

= కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయానికి నిదులు విడుదల చేయటం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/