Begin typing your search above and press return to search.
ఆదాయం హరించుకున్నా... జగన్ వైఖరిపై కాగ్ ఏమందంటే!
By: Tupaki Desk | 11 Dec 2020 11:36 AM ISTరాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆదాయ విధానంపై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విస్తుపోయింది. నాలుగు రోజుల కిందట విడుదల చేసిన ఆదాయ, వ్యయాల లెక్కలకుసంబంధించిన నివేదికలో అనేక ఆశ్చర్యకర విషయాలను వివరించింది. ఆదాయం నానాటికీ తగ్గుముఖం పట్టిందని.. అయినా.. ఏపీలో ఖర్చులు ఆగడం లేదని.. కాగ్ అక్షింతలు వేసింది. గత ఏడాదితో పోలిస్తే.. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గుముఖం పట్టిందని వివరించింది. ప్రధానంగా.. వస్తున్న ఆదాయానికి , చేస్తున్న వ్యయానికి కూడా సంబంధం లేకుండా పోయిందని ఆర్థిక విశ్లేషణ చేసింది.
పోలవరం ప్రాజెక్టుకు కేటాయింపులు బాగున్నా.. ఆర్థిక సంవత్సరం ముగిస్తున్నప్పటికీ.. కేటాయించిన మొత్తాన్ని(గత ఆర్థిక సంవత్సరం) విడుదల చేయకపోవడంపై కాగ్ ప్రధానంగా ప్రశ్న సంధించింది. ఇక, ఇతర జలవనరుల శాఖ ప్రాజెక్టుల కేటాయింపులు, మంజూరు, వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉన్నాయని తెలిపింది. ప్రజాసంక్షేమ కార్యక్రమాల పేరిట.. ప్రభుత్వం చేస్తున్నవ్యయాలు.. ఆర్థిక ఇబ్బందులు తలెత్తేలా చేస్తోందని కాగ్ నిశితంగా విమర్శలు గుప్పించడం గమనార్హం.
మరోవైపు.. వ్యవసాయ రాబడి తగ్గుముఖం పట్టిందని పేర్కొన్న కాగ్.. జీడీపీలో వృద్ధి గణనీయంగా తగ్గడాన్ని వివరించింది. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు ఇస్తున్న నిధుల్లో 20 శాతంవేరే పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించడాన్ని కూడా కాగ్ ఎత్తి చూపింది. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ.. ప్రత్యేకంగా 8 శాతం మించి ఇతర పథకాలకు మళ్లించరాదని.. సూచించింది. ఇక, అప్పులు కూడా పెరిగిపోతున్నాయని.. ఇప్పటికే ఎఫ్ ఆర్ ఎంబీ పరిధిని మించి అప్పులు చేస్తున్నారని.. మున్ముందు ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని కాగ్ హెచ్చరించడం గమనార్హం. మరి ఇంతగా తలంటినా.. ప్రభుత్వంలో మాత్రంమార్పు రావడం లేదని అంటున్నారు పరిశీలకులు.