Begin typing your search above and press return to search.
రఫేల్ డీల్ పై కాగ్ షాకింగ్ రిపోర్ట్!
By: Tupaki Desk | 24 Sept 2020 7:30 PM ISTరఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై 2019 ఎన్నికలకు ముందు తీవ్రస్థాయిలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. రఫేల్ డీల్ లో అవకతవకలు జరిగాయంటూ ఎన్డీఏ సర్కార్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఎన్డీఏ, కాంగ్రెస్ ల మధ్య ఈ వ్యవహారం రాజకీయ యుద్ధానికి దారి తీసింది. మరోవైపు, రఫేల్ ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్‌లో తిరస్కరించింది.‘ఈ వ్యవహారం సద్దుమణిగిన చాలాకాలం తర్వాత మరో వివాదం తెరపైకి వచ్చింది. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థ డసాల్ట్, ఎంబీడీఏలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం కాంట్రాక్టు దక్కించుకున్న డసాల్ట్, ఎంబీడీఏలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందజేయాలని ఒప్పందంలో ఉందని, కానీ, అలా చేయడంలో ఆ సంస్థలు విఫలమయ్యాయని కాగ్ వెల్లడించింది. దీంతో, ఒప్పందం ప్రకారం కాంట్రాక్ట్ విలువలో 50 శాతం తిరిగి భారత్‌కు ఆ సంస్థలు అందజేయాలని పార్లమెంట్ లో కాగ్ నివేదిక సమర్పించింది.
126 యుద్ధ విమానాలను కొనుగోలు బిడ్ ను గతంలో డసాల్ట్ ఏవియేషన్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో 36 ఫైటర్ జెట్లను 60 వేల ఖర్చుతో భారత్ కు ఫ్రాన్స్ విక్రయించాల్సి ఉంది. ఆ 36 యుద్ధవిమానాల్లో 30 ఫైటర్ జెట్లు, మరో 6 ట్రైనర్ విమానాలు ఉన్నాయి. అయితే, ఆ 36 జెట్లలో 18 జెట్లను డసాల్ట్ పూర్తిగా నిర్మించి ఇవ్వాలి. మరో,108 ఎయిర్ క్రాఫ్ట్‌లను భారత్ కు చెందిన హిందుస్ధాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తుంది, ఇందుకుగాను, తమ పరిజ్ఞానాన్ని హెచ్ ఏఎల్ కు బదిలీ చేసి డసాల్ట్ నిర్మించాల్సి ఉంది. డీఆర్డీవోకు అత్యాధునిక సాంకేతికత ఇస్తామని చెప్పిన డసాల్ట్...ఆ ప్రాతిపదికనే రఫేల్ డీల్ చేసుకుంది. అయితే, ఆ 36 జెట్లలో ఐదింటిని భారత్‌కు అందజేసిన డసాల్ట్...ఆ టెక్నాలజీ బదలాయింపు పై సైలెంట్ గా ఉండడం తో ఆనుమానాలు మొదలయ్యాయి.
2016లో 6 రకాల టెక్నాలజీ అంశాల వివరాలను తాము ఆ సంస్ధల నుంచి తీసుకోవాలని డీఆర్డీవో తెలిపింది. అయితే, వాటిలో 5 టెక్నాలజీ వివరాలను బదలాయించే సామర్ధ్యం తమకు లేదని డీఆర్డీవోకు ఆ సంస్థలు స్పష్టం చేశాయి. ఇక, ఆ ఆరో టెక్నాలజీ తేలికపాటి యుద్ధ విమానాల ఇంజన్లు తయారీ చేసేందుకు ఉద్దేశించినది. ఈ క్రమంలోనే టెక్నాలజీ పేరుతో రాఫెల్ యుద్ధ విమానాలను భారత్‌కు అంటగట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కాగ్ కూడా తన నివేదికలో అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, పార్లమెంటులో ఈ నివేదికపై చర్చ జరగకుండానే సభ నిరవధిక వాయిదా పడింది.