Begin typing your search above and press return to search.

కేబినెట్ మీటింగ్: నిర్ణయం పై జగన్ సస్సెన్స్?

By:  Tupaki Desk   |   27 Dec 2019 6:47 AM GMT
కేబినెట్ మీటింగ్: నిర్ణయం పై జగన్ సస్సెన్స్?
X
నేటి కేబినెట్ మీటింగ్ లో విశాఖ ను పరిపాలన రాజధానిగా ప్రకటించబోతున్నారనే ప్రచారం విస్తృతంగా సాగిన సంగతి తెలిసిందే.. దీనిపై అమరావతిలో ఆందోళనలు కూడా పెచ్చరిల్లుతున్నాయి. మరో వైపు విశాఖే రాజధాని అంటూ విజయసాయి రెడ్డి అక్కడ నిన్న సమీక్ష కూడా నిర్వహించారు. ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.

ఈ క్రమంలోనే నేటి కేబినెట్ మీటింగ్ లో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. రాజధాని మార్పుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కంటే ప్రస్తుతానికి నిర్ణయాన్ని ప్రకటించకూడదని.. దీనిపై అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతిపక్ష పార్టీలను ఈ విషయంలో బుక్ చేశాక రాజధాని పై నిర్ణయిద్దామని జగన్, మంత్రులు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల తో అమరావతి విషయం లో చంద్రబాబు చేసిన ఏకపక్ష నిర్ణయం లాంటి పొరపాటు కు తావివ్వకుండా జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలిసింది. విశాఖ పై జీఎన్ రావు ఇచ్చిన నివేదిక పై ఈ రోజు కేబినెట్ లో కేవలం చర్చ మాత్రమే జరుపుతారు. ఆ తర్వాత దీని పై అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి ఏ పార్టీ దేనికి సపోర్టు అని నిర్ణయం తీసుకుంటారు. అందరి అభిప్రాయలు తీసుకున్నాక నిర్ణయం తీసుకుందామని జగన్ డిసైడ్ అయినట్టు తెలిసింది.

ఏకపక్షంగా విశాఖ ను ప్రకటిస్తే ప్రతికూల ప్రభావం చూపిస్తుందని.. అదే ప్రతి పక్షాలను కూడా ఈ నిర్ణయం లో భాగస్వాములను చేసి తిలాపాపం తలా పిడికెడు గా చేయాలని జగన్ తాజా కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించినట్టు తెలిసింది. విశాఖ రాజధాని విషయం లో ప్రతి పక్షాలను బుక్ చేయాలని జగన్ వ్యూహం పన్నినట్టు తెలిసింది. అందుకే విశాఖ పై నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చన్న ప్రచారం సాగుతోంది. మరి కేబినెట్ ఏం నిర్ణయిస్తారన్నది అధికారికంగా తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..