Begin typing your search above and press return to search.

బీపీ పెంచేస్తున్న జగన్

By:  Tupaki Desk   |   13 March 2022 5:00 PM IST
బీపీ పెంచేస్తున్న జగన్
X
మంత్రివర్గ ప్రక్షాళన కాదుకానీ ఇటు మంత్రుల్లోను అటు ఎంఎల్ఏల్లో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి బీపీ పెంచేస్తున్నారు. పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ళ తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేస్తానని అధికారంలోకి వచ్చినపుడే జగన్ బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే.

రెండున్నర ఏళ్ళయిన దగ్గర నుండి మంత్రివర్గ ప్రక్షాళనపై ఊహాగానాలు, అంచనాలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. మంత్రుల్లో కూడా ఇదే విషయమై బహిరంగంగానే చర్చలు జరిగినా జగన్ మాత్రం ఎప్పుడూ నోరిప్పలేదు.

అలాంటిది మొన్నటి క్యాబినెట్ సమావేశంలో స్వయంగా జగనే మంత్రివర్గ ప్రక్షాళన విషయాన్ని ప్రస్తావించారు. తొందరలోనే ముహూర్తుం ఉంటుందని, మంత్రులుగా తప్పించిన వారందరినీ పార్టీ కోసం వాడుకుంటానని జగన్ చెప్పారు. దీంతో మంత్రులుగా కంటిన్యు అయ్యేదెవరు ? మంత్రివర్గంలో స్ధానాలు కోల్పోయేదరు ? కొత్తగా మంత్రియోగం ఎవరికి ఉంది ? అనే కాంబినేషన్లపై విపరీతమైన చర్చలు మొదలైపోయాయి.

మత్రివర్గంపై జగన్ కు కచ్చితమైన లెక్కలుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బెదిరింపులకో బ్లాక్ మెయిలింగులకో లొంగేరకంకాదు. కాబట్టి జిల్లాల వారీగా, సామాజికవర్గాల వారీగా సమతూకం చూసుకునే డ్రాప్ చేయటం, కొత్తవారిని ఎంపికచేసుకోవటం ఉంటుంది.

అలాగే కంటిన్యు అయ్యేవారి విషయంలో కూడా కచ్చితమైన నిర్ణయాలే తీసుకుంటారు. అలాంటిది తన నిర్ణయాలు తాను తీసుకోకుండా అనవసరంగా ముందుగా ప్రకటించారు. దీంతో అందరిలోను బీపీ పెరిగిపోతోంది.

ముహూర్తాన్నేదో హఠాత్తుగా ప్రకటించేసి ప్రక్రియను పూర్తి చేసేసుంటే సరిపోయేది. అలాకాకుండా ఏదో యథాలాపంగా చెప్పినట్లు కొంచెం శాంపుల్ చూపించి వదిలేయటంతో అందరిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎంఎల్ఏలకన్నా వాళ్ళ మద్దతుదారుల నుండి వస్తున్న ఒత్తిళ్ళను తట్టుకోవటం మంత్రులు, ఎంఎల్ఏలక బాగా కష్టమైపోతోంది.

హఠాత్తుగా మంత్రివర్గ ప్రక్షాళనను ప్రకటించేసుంటే ఏదో రెండు మూడు రోజులు దానిపై చర్చలు జరిపి తర్వాత కామ్ అయిపోయేవారు. కానీ దానికి భిన్నంగా జరగటంతో ఇపుడు పార్టీలో, ప్రభుత్వంతో పాటు జిల్లాల్లో కూడా ఇదే విషయమై చర్చలు జోరుగా సాగుతున్నాయి.