Begin typing your search above and press return to search.

ప్రమాణ స్వీకారానికి ముందు అరుదైన ఘటన

By:  Tupaki Desk   |   6 Dec 2016 2:52 AM GMT
ప్రమాణ స్వీకారానికి ముందు అరుదైన ఘటన
X
సాధారణంగా ఏదైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించే సమయంలో ఆ కార్యక్రమం చాలా ప్రోగ్రామ్డ్ గా ఉంటుంది. ఎక్కడా ప్రసంగాలు లాంటివి ఉండవు. పదవిని చేపట్టే అధినేత.. ఆయన పరివారం.. ఆహుతులు.. అతిధులు వెయిట్ చేస్తున్న వేళ.. గవర్నర్ వస్తారు. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలై.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాలని కోరటం.. ఆయన అందుకు ఓకే అనటంతో కార్యక్రమం మొదలవుతుంది.

రాష్ట్రాధినేతగా ఎంపిక చేసే వ్యక్తిని.. గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించటం ద్వారా.. ఆ ప్రక్రియ పూర్తి అవుతుంది. శాసనసభకు అధినేతగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. తన మంత్రిమండలిలో ఉండే సహచర సభ్యుల జాబితానుగవర్నర్ కు అప్పగించటం.. వారి చేతా ప్రమాణస్వీకారోత్సవం పూర్తి చేసిన తర్వాత.. జాతీయ గీతాలాపనతో కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇందులో ఎక్కడా.. ఎవరి ప్రసంగాలు ఉండవు. కానీ.. తాజాగా ఎపిసోడ్ ఇందుకు భిన్నం.

ఓపక్క అమ్మ.. ఇక లేరన్న వార్తను జీర్ణించుకోని వేళ.. సాగుతున్న ప్రమాణస్వీకారోత్సవంలో అరుదైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ తో పాటు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. అన్నాడీఎంకే కీలక నేతలు హాజరైన అమ్మ వారసుడి ప్రమాణస్వీకారోత్సవంలో గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రసంగించారు. మామూలుగా అయితే.. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణకు ముందు ఇలాంటివి ఉండవు. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోభావోద్వేగంతో మాట్లాడిన గవర్నర్.. జయలలిత మరణం తనను కలిచి వేసిందని.. ఆమె గొప్ప నాయకురాలన్న వ్యాఖ్యల్ని గవర్నర్ చేశారు. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటివి జరుగుతుంటాయి. అమ్మ మరణంతో ఇలాంటిది తాజా చోటు చేసుకుందని చెప్పాలి

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/