Begin typing your search above and press return to search.

టీం ఇండియా స్పాన్సర్ షిష్ డబ్బులకు ఎగనామం..!

By:  Tupaki Desk   |   10 Jan 2023 12:30 AM GMT
టీం ఇండియా స్పాన్సర్ షిష్ డబ్బులకు ఎగనామం..!
X
టీం ఇండియా ధరించే జెర్సీ స్పాన్సర్ షిష్ కోసం బడా కంపెనీలు ఎంతగా పోటీ పడుతాయో అందరికీ తెలిసిందే. ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కోట్లు కుమ్మరించి మరీ స్పాన్సర్ షిప్ ను దక్కించుకునేందుకు ఆరాట పడుతుంటాయి. 2019లో చైనీస్ మొబైల్ కంపెనీ టీం ఇండియా స్పాన్సర్ షిష్ నుంచి వైదొలగింది.

ఆ సమయంలో బైజూస్ టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ షిష్ కోసం భారీ మొత్తంలో బిడ్ దాఖలు చేసింది. దాదాపు ఏడాదికి 200 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఒప్పందంలో భాగంగా రూ.140 కోట్ల గ్యారెంటీని సైతం బీసీసీఐకి సమర్పించింది. అయితే ఒక ఏడాదిపాటు సక్రమంగా డబ్బులు చెల్లించిన బైజూస్ ఆ రెన్యువల్ చేసుకుంటూ పోయింది.

ఎడ్యూటెక్ కంపెనీగా బైజూస్ ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవలీ కాలంలో ఈ కంపెనీ భారీగా నష్టాల్లో కురుకుపోయింది. అకౌంటింగులో తప్పుడు లెక్కలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే బైజూస్ బీసీసీఐకి చెల్లించాల్సిన డబ్బులు చెల్లించేందుకు వెనకడుగు వేస్తోందని సమాచారం.

ఒప్పందం ప్రకారం కుదుర్చున్న విధంగా తమ వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని బైజూస్ వాదిస్తోంది. ఈ క్రమంలోనే తమకు డిస్కౌంట్ కావాలని బీసీసీఐని అడుగుతుంది. అయితే బీసీసీఐ మాత్రం బేరసారాలు లేవని ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలోనే ఒప్పంద సమయంలో బైజూస్ గ్యారెంటీగా ఇచ్చిన 140 కోట్లను ఎన్ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే బైజూస్ సైతం తమ బ్యాంక్ గ్యారంటీని ఎన్ క్యాష్ చేసుకున్నా పర్వాలేదని చెబుతోంది. ఇకపై తమకు స్పాన్సర్ షిప్ ను కొనసాగించాలనే ఉద్దేశం లేదని చెబుతోంది. అయితే ప్రస్తుత అగ్రిమెంట్ ను మార్చి వరకు కొనసాగించాలని బీసీసీఐ కోరుతోంది. అయితే తమ వద్ద డబ్బులు లేవని బైజూస్ వెనకడుగు వేస్తుంది. దీంతో బీసీసీఐ బైజూస్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.