Begin typing your search above and press return to search.
2100 సంవత్సరానికి ఆ దేశం పూర్తిగా కనిపించకుండాపోతుందట !
By: Tupaki Desk | 29 Oct 2020 10:20 PM ISTఎటువైపు చూసినా నీలం రంగులో కనిపించే సముద్రం, స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం, రిసార్టుల్లో పర్యాటకుల సందడి , మాల్దీవుల్లో రోజూ ఈ సుందర దృశ్యాలు కనిపిస్తాయి. అయితే , వాతావరణంలో మార్పుల వల్ల సముద్రం మట్టం పెరిగి మాల్దీవులు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. మాల్దీవుల్లో నివసించే ప్రజలు దాదాపుగా అందరూ అక్షరాస్యులే. ఇక్కడి అక్షరాస్యత 98 శాతంగా ఉంది. ఇది ఆసియాలో అతి చిన్న దేశం. అంతేకాకుండా ప్రపంచంలో అతి చిన్న ముస్లిం దేశం ఇదే.
అత్యంత సురక్షితమైన పర్యాటక ప్రదేశం కూడా ఇదే. మాల్దీవుల జాతీయ పతాకంలో చంద్రుడు ఇస్లాంకు ప్రతిబింబంగా నిలిస్తే, ఆకుపచ్చని రంగు ఖర్జూర చెట్లను సూచిస్తుంది. ఎరుపు రంగు రక్తం చిందించిన మాల్దీవుల హీరోలకు గుర్తుగా చెబుతారు. కరెన్సీ ‘రుఫియా’. ఇండియాకు దక్షిణభాగంలో మాల్దీవులు ఉంటాయి. 1965 వరకు ఈ దీవులు బ్రిటిష్ ఆధీనంలోనే ఉన్నాయి. మాల్దీవుల్లో సుమారు 200 దీవులు నివాసానికి అనువుగా ఉన్నాయి. 80 దీవులు టూరిస్టు రిసార్టులుగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆల్కహాల్ హోటల్స్, రిసార్టుల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పర్యాటకులకు అక్కడ మాత్రమే మద్యం తీసుకోవడానికి అనుమతి ఉంటుంది.
ఎంతో ఆహ్లాదకరంగా , అందమైన ఈ దీవులు ఎంతోమంది పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. కానీ, ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా చూస్తే , ఇదే విధంగా కొనసాగితే 2100 సంవత్సరాని మాల్దీవులు 80 శాతం సముద్రంలో కలిసిపోనున్నాయి. అక్కడి 1200 దీవులు అన్ని కూడా సముద్ర మట్టానికి కేవలం 1 అడుగు ఎత్తులోనే ఉన్నాయి. 2004 లో సునామి వచ్చిన సమయంలో 20 దీవులు సమూలంగా సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఆ తర్వాత కూడా కొంచెం కొంచెం గా ఆ నగరాన్ని సముద్రం ముంచేస్తూవస్తోంది. దీనితో ప్రభుత్వం కోట్లు ఖర్చు పెట్టి కృత్రిమ దీవులు ఏర్పాటు చేసి , అక్కడికి ప్రజలని తరలిస్తున్నారు.