Begin typing your search above and press return to search.
ప్లాస్టిక్ ముప్పు ముంచుకొస్తోం ది.. 2030 నాటికి పరిస్థితి దారుణం
By: Tupaki Desk | 20 Sept 2020 9:30 AM ISTమానవజీవితంలో భాగమైన ప్లాస్టిక్.. పర్యావరణాన్ని నాశనం చేస్తూ మన బతుకులను ఛిద్రం చేస్తోంది. ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఫలితాలు ఇవ్వడం లేదు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటూ స్వచ్ఛందసంస్థలు ప్రచారం చేస్తున్నన్పటికీ.. ప్రజల్లో ఏ మార్పు రావడం లేదు. వాడకానికి సులువుగా ఉంటుందని ఎంత నిషేధం విధించినా వాడుతూనే వున్నారు. మరో వైపు ఎన్ని కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా, జరిమానాలు విదిస్తున్నా రహస్యంగా కొన్ని ప్రమాదకర కవర్లు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ కొనసాగుతోంది. అవి సులభంగా మార్కెట్లలోకి చేరి జనం చేతుల్లోకి వెళుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ను పరిపూర్ణంగా నిషేధిస్తే తప్ప ఈ మహమ్మారి నంచి మనల్ని మనం కాపాడుకోలేం.
కాగా ఇటీవల కెనడా బృందం చేసిన అధ్యయనం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 2030 నాటికి ప్రపంచ జలాల్లో 5.30 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతాయని ఆ అధ్యయనం తేల్చిచెప్పింది. ఇది 2005 సంవత్సరం నాటి ప్లాస్టిక్ వ్యర్థాలకు ఏడురెట్లు ఎక్కువ.
ప్రతి ఏడాది జలాల్లోకి 2.40 నుంచి 3.40 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో టొరాంటో యూనివర్శిటీకి చెందిన కన్జర్వేషన్ బయాలజిస్ట్ స్టీఫెనీ బొరెల్లీ కొన్ని కీలకసూచనలు చేశారు.
‘ప్రస్తుతం మనముందున్న లక్ష్యం ఒక్కటే. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిస్థాయిలో నిలిపివేయాలి. అంటే ప్రపంచదేశాలన్నీ మూకుమ్మడిగా ప్లాస్టిక్‌ను నిషేధించాలి. ప్రస్తుతం వ్యర్థాలరూపంలో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించి రీ సైక్లింగ్ చేయాలి. లేదంటే మన భవిష్యత్ ప్రమాదంలో పడ్డట్టే . 2015లో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్‌కు పనికి రానివని తేలింది. అందువల్ల మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం నదీతీరప్రాంతాల, బీచ్‌లలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరేందుకు కొన్ని లక్షల మంది కార్మికులు తిరుగుతున్నారు. ప్లాస్టిక్ పెరుగుదల ఇప్పటిలాగే ఉంటే 2030 నాటికి 100 కోట్ల మంది కార్యకర్తలు ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరడానికి అవసరం అవుతారు. ఆ స్థాయిలో మానవవనరులను ఉపయోగించే స్థితిలో ఈ ప్రపంచం ఉన్నదా అని' ఆలోచించాలి’ బొరెల్లీ పేర్కొన్నారు.