Begin typing your search above and press return to search.

అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే కొనండి : అధ్యక్షుడు జో బైడెన్ !

By:  Tupaki Desk   |   26 Jan 2021 1:00 PM IST
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే కొనండి : అధ్యక్షుడు జో బైడెన్ !
X
అమెరికా నూతన అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించిన జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాలనే వాడదామని బైడెన్ కీలక విషయాలు చెప్పారు. అలాగే అమెరికన్ల తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలనే కొనాలని ఆయన ట్వీట్ చేశారు. తమ ఫెడరల్ ప్రభుత్వం కూడా గ్యాస్ తో నడిచే వాహనాల వాడకాన్ని దశల వారీగా తొలగించనున్నట్టు వెల్లడించారు. ఇందన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయనున్నట్టు బైడెన్ తెలిపారు.

టెస్లా, రివియన్, లార్డ్‌ స్టౌన్ వంటి అమెరికాకు చెందిన ఈవీ వెహికల్స్ మేకర్లు, అలాగే ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో అగ్రగామి అయిన ఫోర్డ్ జనరల్ మోటార్స్ వంటి లెగసీ వాహన తయారీదారులకు ఎక్కువ లబ్దిచేకూరనుంది. జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2019 నాటికి, ఫెడరల్ ప్రభుత్వ దాదాపు 650,000 వాహనాలు ఉన్నాయి. ఇందులో 245,000 సివిల్ వెహికల్స్, 173,000 సైనిక వాహనాలు, 225,000 పోస్ట్ ఆఫీస్ వాహనాలు ఉన్నాయి. 2019 లో 4.5 బిలియన్ మైళ్ల వరకు ఈ వాహనాలన్నీ ప్రయాణించాయి. గ్యాస్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయడానికి వినియోగదారులకు రిబేటులు లేదా ప్రోత్సాహకాలను అందించే వ్యవస్థను రూపొందిస్తానని బిడెన్ హామీ ఇచ్చారు.

గ్యాస్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలన్న బైడెన్, అమెరికా వినియోగదారులకు రాయితీలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం, 7,500 డాలర్లు ఫెడరల్ టాక్స్ క్రెడిట్‌ కు తాను మద్దతు ఇస్తున్నానని అన్నారు. అలాగే కారు కొనుగోలుదారులను ఎలక్ట్రిక్‌కు మార్చడాన్ని ప్రోత్సహించడానికి కొత్త ప్రోత్సాహకాలను అందించనున్నట్టు బైడెన్ చెప్పారు. దీనిపై గతంలో మాజీ అధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేసినప్పటికీ అది అంతగా విజయవంతం కాలేదు.