Begin typing your search above and press return to search.

ప్రైవేట్ ట్రావెల్ బస్సు తగలబడిపోయింది

By:  Tupaki Desk   |   18 Jan 2016 4:56 AM GMT
ప్రైవేట్ ట్రావెల్ బస్సు తగలబడిపోయింది
X
పెను ప్రమాదం తృటిలో తప్పింది. బస్సులో వచ్చిన మార్పును గుర్తించి.. వెనువెంటనే అలెర్ట్ చేయటంతో పాటు..అదృష్టం బాగుండటంతో పెను ప్రమాదం నుంచి 46 మంది తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి విశాఖపట్నం నుంచి గుంటూరుకు వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు తగలబడింది. అయితే.. బస్సు వెనుక సీట్లలోకూర్చున్న వారు అలెర్ట్ గా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.

ఆదివారం రాత్రి విశాఖ నుంచి బయటుదేరిన ప్రైవేట్ బస్సు పాతగాజువాక వద్దకు చేరుకుంది. అదే సమయంలో వెనుక నుంచి వైర్లు కాలిన వాసన రావటంతో.. వెనుక కూర్చున్న కుర్రాళ్లు.. బస్సుక్లీనర్ ను హెచ్చరించారు. అదే సమయంలో.. గాజువాక స్టాప్ వద్ద బస్సు ఆగటం.. వెనుక నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. అప్పటికే ప్రయాణికులు అలెర్ట్ గా ఉండటంతో బస్సు నుంచి క్షేమంగా బయటపడ్డారు. ఏసీలో చోటు చేసుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు తగలబడినట్లు చెబుతున్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న 46 మంది సేఫ్ గా బయటపడగా.. వారు వెంట ఉన్న లగేజ్ మాత్రం దాదాపుగా కాలిపోయింది. వెనుక సీట్లలో కూర్చున్న వారి అలెర్ట్ నెస్ తో పాటు.. మంటలు స్టార్ట్ అయ్యేసమయానికి బస్సు ఆగి ఉండటంతో పెను ప్రమాదం తృటిలో తప్పిందని చెప్పొచ్చు.