Begin typing your search above and press return to search.

కరోనా భయంతో అనుమానితులని బస్సు పై దాడి!

By:  Tupaki Desk   |   21 Feb 2020 1:30 PM GMT
కరోనా భయంతో అనుమానితులని బస్సు పై దాడి!
X
కోవిడ్ -19 వైరస్ .. ఈ వైరస్ భారిన పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుండటం మొత్తం యావత్ ప్రపంచాన్నే వణికేలా చేస్తోంది. ఎప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 76 వేల కోవిడ్-19 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే సుమారుగా 2వేల 247మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలని కోల్పోయారు. వారిలో ఎక్కువ శాతం మంది .. చైనాలోని వుహాన్ కి చెందివారే కావడం గమనార్హం. చైనా తో పాటుగా మరో 26 దేశాలు ఈ వైరస్ భయం తో వణికిపోతున్నాయి.

అయితే , ఈ కరోనా భయం తో ఆందోళన కారులు ఉక్రెయిన్ లో పెద్ద ఘోరం చేయడానికి పూనుకున్నారు. కరోనా అనుమానితులుగా భావించి కొన్ని రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నవారిని వేరే చోటికి తరలిస్తున్న సమయంలో , వారికి కరోనా వైరస్ ఉందని, వారికి ఈ భూమిపై బ్రతికే ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ ..వారిని తరలిస్తున్న బస్సు పై దాడికి ఎగబడ్డారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్నుం చి ఫేక్ ఈమెయిల్‌ తో తప్పుడు సమాచారం అందించింది. దీనిపై ఉక్రెయిన్ ఆరోగ్య మంత్రి జోర్యానా స్కాలెస్కా స్కైప్ ద్వారా ఆందోళన కారులతో మాట్లాడి నిజాలను వెల్లడించారు.

నోవీ సంఝారీ హాస్పిటల్ లో జరిగిన ఆందోళన ఇప్పటికైనా ప్రశాంతం అవుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు. గురువారం 45 ఉక్రెనియా వాసులు, 27మంది విదేశీయులు వుహాన్ నుంచి ఖార్కివ్ ప్రాంతానికి వచ్చారు. వారందరినీ ఆరు బస్సుల్లో నోవి సంఝారీ హాస్పిటల్‌ కు కొన్ని టెస్టుల నిమిత్తం తీసుకొచ్చారు. వారందరినీ పరిశీలనలో ఉంచి 14రోజుల తర్వాత ప్రత్యేక బలగాలతో వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. వుహాన్ నుంచి వచ్చినందుకు అనుమానంతోనే ఇలా కొన్ని రోజులపాటు వారిని పరీక్షించామని నిజానికి ఎవరూ కరోనా రోగులు కాదని ఆరోగ్య శాఖ చెప్పింది. ప్రయాణికులలో చాలా మంది 30 ఏళ్లలోపు వారే అని , మనమంతా మనుషులమే. వుహాన్ లో ప్రాణాలు వదిలిన వారు కూడా మనలాంటి వాళ్లేనని గుర్తుంచుకోవాలి అని ఉక్రెయిన్ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.