Begin typing your search above and press return to search.

రాజస్థాన్ లో నదిలో పడ్డ బస్సు... 24 మంది దుర్మరణం !

By:  Tupaki Desk   |   26 Feb 2020 3:15 PM IST
రాజస్థాన్ లో నదిలో పడ్డ బస్సు... 24 మంది దుర్మరణం !
X
రాజస్థాన్‌ లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24మంది అక్కడిక్కడే మృతిచెందారు. బూండీలోని కోట లాల్ సాత్ మెగా హైవేపై బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులు, స్నేహితులు కోట నుంచి సవాయ్ మాదోపూర్ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్ నదిలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులు సుమారు 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం అని తెలుస్తుంది.

పూర్తి వివరాలు చుస్తే ...పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వరుడి కుటుంబం... బంధువులతో కలిసి కోటా నుంచి సవాయ్‌ మాధోపూర్‌ బయల్దేరింది. మధ్యలో బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి నదిలో పడి పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే నదిలో పడిపోయినవారిని స్థానికులు రక్షించే ప్రయత్నం చేశారు. దీనితో మృతుల సంఖ్య కొంచెం తగ్గినట్టు పోలీసులు తెలిపారు. కాగా మృతుల్లో ఎక్కువ మంది పురుషులే ఉన్నారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఈ ఘటన కు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఈ సంఘటన తో స్థానికంగా విషాదం నెలకొంది.