Begin typing your search above and press return to search.

జనసేన తరఫున బన్నీ వాస్?

By:  Tupaki Desk   |   12 Aug 2018 4:48 PM GMT
జనసేన తరఫున బన్నీ వాస్?
X
2019 ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన పార్టీలూ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. గత పర్యాయం తెలుగుదేశం పార్టీతో జత కట్టి ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ పవన్ అభ్యర్థుల్ని దించాలనుకుంటున్నాడు.

పలు నియోజకవర్గాల్లో జనసేన తరఫున సెలబ్రెటీలు బరిలోకి దిగే అవకాశముంది. కమెడియన్ అలీతో పాటు పవన్ మిత్రుడైన నిర్మాత రామ్ తాళ్ళూరి సైతం జనసేన తరఫున పోటీ చేస్తారంటున్నారు. తాజాగా మరో సెలబ్రెటీ పేరు జనసేన అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. అతను మరెవరో కాదు.. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు.. అల్లు అరవింద్ నిర్మాణ వ్యవహరాలన్నీ దగ్గరుండి చూసుకునే బన్నీ వాస్.

‘బన్నీ’ సినిమాతో వెలుగులోకి వచ్చిన బన్నీ వాస్ కు.. మెగా ఫ్యామిలీతో ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. అతను జనసేన తరఫున పాలకొల్లు టికెట్ కోసం ట్రై చేస్తున్నాడట. అల్లు అరవింద్ అండ్ కో కొంచెం గట్టిగానే అతడి కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. పాలకొల్లు చిరంజీవి సొంత నియోజకవర్గం అన్న సంగతి తెలిసిందే. ఇక్కడ 2009 ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. ఐతే ఈసారి బన్నీ వాస్ ను దింపి గెలిపించుకోవడాన్ని మెగా ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నట్లు సమాచారం. ఐతే ఇక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది. మరి బన్నీ వాస్ కు టికెట్ దక్కుతుందా.. దక్కితే అతను టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఢీకొట్టి గెలుస్తాడా అన్నది ఆసక్తికరం.