Begin typing your search above and press return to search.

వైసీపీ ప్రజాప్రతినిధులకు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   10 March 2021 5:30 AM GMT
వైసీపీ ప్రజాప్రతినిధులకు బంపర్ ఆఫర్
X
వైసీపీ ప్రజా ప్రతినిధులకు తెలుగుదేశంపార్టీ అద్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తునే ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదేమిటంటే రాజీనామాలు చేయటానికి భయపడుతున్న ఎంపిలపై ఉపఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్ధులను పోటీ పెట్టమని చెప్పారు. ఈ విషయాన్ని తాను చంద్రబాబునాయుడుతో మాట్లాడిన తర్వాతే చెబుతున్నట్లు కూడా అచ్చెన్న భరోసా ఇచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంతసేపు వైసీపీ ఎంపిలను రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారే కానీ తామెందుకు రాజీనామాలు చేయటం లేదో మాత్రం అచ్చెన్న చెప్పటం లేదు. రాజీనామాల విషయంలో వైసీపీని చేస్తున్న డిమాండ్ ను ముందు తామే ఆచరణలో పెట్టవచ్చు కదా. ముందుగా టీడీపీ ఎంపిలు రాజీనామాలు చేస్తే ఆటోమేటిక్ గా వైసీపీ సభ్యులపైనా ఒత్తిడి పెరుగుతుంది కదా.

ప్రత్యేకహోదా విషయంలో 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పారు. హోదా విషయంలో కేంద్రప్రభుత్వంపై ఎంపిలతో రాజీనామాలు చేయిద్దామని చంద్రబాబుకు జగన్ సూచించారు. అయితే చంద్రబాబు ముందుకురాలేదు. దాంతో తన పార్టీ ఎంపిలతో జగన్ వెంటనే రాజీనామాలు చేయించేశారు. వైసీపీ ఎంపిలు రాజీనామాలు చేసినపుడు అంతా డ్రామాలన్నారు. తర్వాత లోక్ సభ స్పీకర్ పై రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి పెట్టి ఆమోదింపచేసుకున్నారు.

దాంతో ఏమి మాట్లాడాలో తెలీక వెంటనే రాజ్యసభ ఎంపిలతో కూడా రాజీనామాలు చేయించాలని డిమాండ్లు మొదలుపెట్టారు. అంటే అధికారంలో ఉన్నా రాజీనామాలు చేయటానికి టీడీపీ ఇష్టపడదు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా రాజీనామాలకు ఇష్టపడటంలేదు. ముందు తాము రాజీనామాలు చేసి తర్వాత అధికారపార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలకు డిమాండ్ చేయాలన్న ఇంగితం కూడా టీడీపీ కోల్పోయింది.

ఇక్కడే అచ్చెన్న చెప్పిన డైలాగులే విచిత్రంగా ఉంది. వైసీపీ ఎంపిలు రాజీనామాలకు భయపడుతున్నారట. ఎందుకంటే మళ్ళీ గెలుపుమీద నమ్మకం లేకే రాజీనామాలు చేయటం లేదని అచ్చెన్న అన్నారు. అందుకనే తమ పార్టీ తరపున పోటీ పెట్టమంటూ భరోసా ఇచ్చారు. మరి అదే భరోసా జగన్నుండి తీసుకుని తామూ రాజీనామాలు చేయచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పటంలేదు. అప్పటికేదో ఇప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ బంపర్ మెజారిటితో గెలిచిపోతుందనే భ్రమలో ఉన్నట్లున్నారు. మొత్తానికి అచ్చెన్న బంపర్ ఆఫర్ పై చర్చలు జరుగుతోంది.