Begin typing your search above and press return to search.
జన్ ధన్ ఖాతాదారుడికి బంపర్ ఆఫర్ ...ఒక్క ఫోన్ కాల్ 80 కోట్లు !
By: Tupaki Desk | 6 Feb 2020 7:00 AM ISTసాధారణంగా మన అకౌంట్ లోకి మనకి తెలియని వ్యక్తులు 100 రూపాయలు వేసినా కూడా తెగ సంబర పడిపోతుంటారు. అలాంటిది ఒకరి ఖాతాలోకి ఏకంగా 80 కోట్ల రూపాయలు ఉత్త పుణ్యానికే వచ్చి పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న సదరు అకౌంట్ హోల్డర్ తొలుత కొంత ఆశ్చర్యానికి గురైనా కూడా, ఎదో 100, 1000 అయితే సరే కానీ, కోట్లల్లో వ్యవహారం ఉండటం తో ఆదాయ పన్ను విభాగం కి చెందిన అధికారులకి తెలియజేయడం తో ఈ మొత్తం వ్యవహారం బయట పడింది. ఈ సంఘటన కర్ణాటక లో జరిగింది.
పూర్తి వివరాలు చూస్తే ... కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ బీడీ కాలనీ కి చెందిన రెహానా బానో, సయ్యద్ మల్లిక్ దంపతులు 2015లో రెహానా పేరిట ఆమె భర్త జన్‌ధన్ ఖాతాను ప్రారంభించారు. ఆ తరువాత , ఆ ఖాతాని పెద్దగా ఉపయోగించింది లేదు. కానీ ,గత ఏడాది డిసెంబరు చివరి వారంలో " మీ భార్య పొదుపు ఖాతాలో రూ.కోట్లలో నగదు డిపాజిట్ అయ్యింది. బ్యాంకు ఖాతాను ఇప్పటివరకు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోలేదు, కాబట్టి వెంటనే మీరు ఆధార్ తో అనుసంధానం చేపించుకోండి" అని బ్యాంకు అధికారులు చెప్పడంతో ఆశ్చర్యపోయాడు.
ఆ తరువాత బ్యాంకు అధికారులు చెప్పిన విషయాన్ని విని షాక్ అయిన సయ్యద్, ఆ విషయం పై పూర్తిగా తెలుసుకోవడానికి ఏటీఎంకు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకుంటే, ఖాతాలో దాదాపు రూ.80 కోట్లు ఉన్నట్లు చూపించింది. దీనితో సయ్యద్ నిర్హాంతపోయారు. ఆ తరువాత అంత డబ్బు తన భార్య అకౌంట్ లోకి ఎలా వచ్చిందో చెప్పాలని , అకౌంట్ కి సంబంధించిన వివరాల కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా, వారు దానిపై స్పందించలేదు. దీనితో ఇందులో ఎదో కుట్ర కోణం జరుగుతుంది అని భావించి , ఆదాయ పన్ను విభాగం అధికారులకు సయ్యద్ ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆదాయపు పన్ను అధికారులు విచారణ చేపట్టగా ... డిసెంబరు మూడోవారంలో గుర్తుతెలియని వ్యక్తి రెహాన్‌కు ఫోన్ చేసి ''మీరు ఆన్‌లైన్‌లో చీర కొన్నారు... మీకు లాటరీ వచ్చింది. మీ ఖాతా సంఖ్య చెబితే నగదు బదిలీ చేస్తాం అని చెప్పారు. దీనితో అది నిజమే అని నమ్మిన ఆమె వారికి ఖాతా సంఖ్య చెప్పారు. ఆ తర్వాతే ఆమె ఖాతాలోకి మొత్తం రూ.80 కోట్లు బదిలీ అయ్యాయని, అలాగే ఆమెకి తెలియకుండానే కొన్ని నగదు లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ భారీ స్కామ్ లో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణ లో గుర్తించినట్టు సమాచారం.