Begin typing your search above and press return to search.

ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక .. ఏపీలో ఆ మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం !

By:  Tupaki Desk   |   4 Sept 2020 11:01 PM IST
ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరిక .. ఏపీలో ఆ మంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం !
X
ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఇంటిలిజెన్స్‌ విభాగం తాజాగా ఇచ్చిన నివేదిక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇంటిలిజెన్స్‌ విభాగం ఇచ్చిన నివేదికలో ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు భద్రతకు ముప్పుందని హెచ్చరించింది. దీంతో ఆయనకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కేటాయిచాలని ప్రభుత్వానికి సూచించింది. దీనితో హోం శాఖ ఏపీ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూవ్ వాహనాన్ని కేటాయించింది. వారం క్రితం మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూవ్ వాహనం కేటాయించాలని ఇంటలిజెన్స్ వర్గాలు హోంశాఖకు సూచించినట్టు తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోనే ప్రయాణాలు, పర్యటనలు చేపట్టాలని మంత్రి కన్నబాబుకు ఇంటలిజెన్స్ వర్గాల సూచించాయి.

దీంతో ప్రస్తుతం ఆయన ఈ వాహనంలోనే పర్యటనలు చేస్తున్నారు. ఏపీ వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కన్నబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అలాంటి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే , తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గం నుంచి కన్నబాబు 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం జగన్‌ కేబినెట్‌లో ప్రస్తుతం ఆయన కీలక మంత్రిగా ఉన్నారు. వ్యవసాయశాఖతో పాటు విశాఖ జిల్లా ఇన్‌ ఛార్జ్ గా భాద్యతలు స్వీకరిస్తున్నారు. ‌దీంతో విశాఖ పర్యటనలో ఆయన్ను మావోయిస్టులు టార్గెట్‌ చేసే అవకాశం ఉండటంతో మంత్రి కన్నబాబుకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ఏర్పాటు చేయనున్నారు.