Begin typing your search above and press return to search.

బుల్డోజర్ న్యాయం పై తీవ్రమవుతున్న నిరసన.. సుప్రీంలోనూ కేసు

By:  Tupaki Desk   |   25 April 2022 11:30 AM GMT
బుల్డోజర్ న్యాయం పై తీవ్రమవుతున్న నిరసన.. సుప్రీంలోనూ కేసు
X
యూపీలో సీఎం యోగి పాలనలో మొదలై.. మధ్యప్రదేశ్ కు పాకి.. ఉత్తరాఖండ్ లోనూ వినిపిస్తున్న పదం ‘బుల్డోజర్ న్యాయం’. అక్రమాలు, అన్యాయాలుకు పాల్పడినవారు లొంగిపోకుంటే వారి ఇళ్లు, ఆస్తుల ముందు బుల్డోజర్ ను ఉంచి దిగివచ్చేలా చేయడం యోగి మార్కుగా ముద్రపడింది. ఇది చాలావరకు ఫలితాలన్నిచ్చింది. యూపీలో ముస్లింలు సైతం యోగికి ఓటేశారంటూ దానికి కారణం.. బుల్డోజర్ న్యాయంతో అక్కడ నేరగాళ్ల పీచమణిచిన యోగి పాలనే కారణం.

కాగా, ఇటీవలి ఎన్నికల్లోనూ యోగి బుల్డోజర్ పదం ఎక్కువగా వినిపించింది. సీఎం యోగినే ఏకంగా.. బుల్డోజర్లు రిపేరుకు వెళ్లాయని, మార్చి 10 (ఎన్నికల ఫలితాల వెల్లడి) తర్వాత రంగంలోకి దిగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు యోగి బుల్డోజర్ బాబా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. మొత్తానికి యూపీలో మోదీ గెలుపు వెనుక బుల్డోజర్ పాత్ర అలా ఉంది. అయితే, ఈ క్రమంలో నచ్చనివారి పైకి బుల్డోజర్ లను పంపుతున్నారన్న విమర్శలూ వినిపించాయి. కాగా, ఇదే తరహా న్యాయం యూపీ పొరుగునున్న ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ లకూ వ్యాపించింది. ఉత్తరాఖండ్ లో ఇటీవల శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా అల్లర్లకు పాల్పడిన వారి ఇళ్ల మీదకు పోలీసులు బుల్డోజర్లను తీ సుకెళ్లారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే, అవి అప్పటికే అక్కడ ఉన్నాయని.. వేరే పనిమీద వచ్చాయని పోలీసులు ఖండించారు.

జహంగిర్ పురిలోనూ

గత శనివారం వాయువ్య ఢిల్లీ జహంగిర్ పురిలో హనుమజ్జయంతి వేడుకల సందర్భంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ యువకుడు కాల్పులకు తెగబడడం ఓ ఎస్ఐకు గాయాలవడం జరిగింది. మొత్తం 23 మందిని పోలీసులు నిందితులుగా తేల్చారు. అయితే, ఇదే ప్రాంతంలో కూల్చివేతకుల పాల్పడుతుండడం, అది కూడా ఓ బీజేపీ నేత లేఖ రాశాక మున్పిపాలిటీ వెంటనే స్పందించడం వివాదాస్పదం అవుతోంది. సుప్రీంకోర్టు కలగజేసుకుని.. నిర్మాణాల కూల్చివేత డ్రైవ్‌ను వెంటనే నిలిపివేయాలని ఆదేశించడంతో కూల్చివేతను ఆపేశారు. అయితే సక్రమ నిర్మాణాలపైనా అధికారులు ప్రతాపం చూపినట్లు తెలుస్తోంది.

అన్ని పత్రాలున్నప్పటికీ తన జ్యూస్‌ షాప్‌ను ధ్వంసం చేశారంటూ గణేశ్‌ కుమార్‌ గుప్తా అనే చిరు వ్యాపారి వాపోయారు. 1977లోనే దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ తన దుకాణానికి అనుమతి ఇచ్చిందని, దానికి సంబంధించిన అన్ని పత్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.‘నా వద్ద అన్ని పత్రాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అధికారులకు మొరపెట్టుకున్నా వినలేదు. కూల్చివేతను ఆపాలని గంట క్రితమే సుప్రీంకోర్టు ఆదేశించిందని చెప్పినా పట్టించుకోలేదు. నా కుటుంబంలోని వారెవరూ అల్లర్లకు పాల్పడలేదు. నేనో సాధారణ దుకాణాదారుడిని. నా షాప్‌ను ఎందుకు ధ్వంసం చేయాలి?’అని గణేశ్‌ కుమార్‌ వాపోయారు.

బుల్డోజర్లతో ఓ చిన్నపాటి ఇంటిని కూల్చేస్తుంటే అందులో నివసించే ఓ మహిళ విలవిల్లాడిపోయింది. కూల్చివేయొద్దంటూ అధికారులను బతిమాలింది. అయినప్పటికీ కనికరం చూపని అధికారులు.. చూస్తుండగానే ఆమె సామగ్రిని జేసీబీలతో ఎత్తి ట్రాక్టర్‌లోని మట్టిలో పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. బుల్డోజర్‌కు అడ్డుగా బృందా కారాట్‌ జహంగీర్‌పురిలో బుధవారం పర్యటించిన సీపీఎం నేత బృందా కారాట్‌ ఓ బుల్డోజర్‌కు అడ్డుగా నిల్చొని, కూల్చివేతలను ఆపాలని డిమాండ్‌ చేశారు. జహంగీర్‌పురిలో పర్యటించేందుకు వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని పోలీసులు బుధవారం అడ్డుకున్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దిల్లీలో పేదలపై యుద్ధం ప్రకటించిందని ఒవైసీ ఆరోపించారు. కాగా, బుల్డోజర్ న్యాయం గురించి ప్రశిస్తూ ఓ న్యాయవాది ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాడు.