Begin typing your search above and press return to search.

అలస్కా వాసుల్ని హడలిపోయేలా చేసిన భూకంపం

By:  Tupaki Desk   |   23 July 2020 9:45 AM IST
అలస్కా వాసుల్ని హడలిపోయేలా చేసిన భూకంపం
X
అమెరికాలోని అలస్కాలో చోటు చేసుకున్న భూకంపం అక్కడి వారిని ఉలిక్కిపడేలా చేసింది. అలస్కా దక్షిణ తీరంలో చోటు చేసుకున్న ఈ శక్తివంతమైన భూకంపం అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసింది. అయితే.. తొలుత భూకంపాన్ని తప్పుగా అర్థం చేసుకున్న అక్కడి ప్రజలు సునామీగా భావించారు. తమ ఇళ్లను వదిలి.. ఎత్తైన కొండ ప్రాంతాలకు పరుగులు తీశారు.

లక్కీగా ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదు. రిక్టర్ స్కేల్ మీద 7.8గా నమోదైనప్పటికి భారీ నష్టం వాటిల్లకపోవటం గమనార్హం. అతి తక్కువ జనాభా ఉన్న అలస్కా ద్వీపకల్పంలో చోటు చేసుకున్న భూకంపం అక్కడి వారిని మాత్రం భయపెట్టింది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం పెర్రివిల్లేకు ఆగ్నేయ దిశలో తీరం నుంచి సముద్రంలోకి 105 కిలోమీటర్ల దూరంలో 17 మైళ్ల లోతులో ఈ భూకంపం చోటు చేసుకుంది. రాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ భూకంపాన్ని తొలుత సునామీగా భావించారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రిక్టర్ స్కేల్ మీద భారీగా నమోదైన తీవ్రత ఉన్నప్పటికీ భూమి పెద్దగా కంపించలేదని.. సముద్రంలో అలలు మాత్రం పెద్ద ఎత్తున ఎగిసిపడినట్లుగా చెబుతున్నారు. భూకంపం తీవ్రత కారణంగా అలస్కాకు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్ చిన్న పట్టణాల్లో భూమి తీవ్రంగా కంపించినట్లుగా అక్కడి వారు చెబుతున్నారు. భూకంప కేంద్రానికి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి మాత్రం భూకంప తీవ్రత పెద్దగా తెలీలేదని తెలుస్తోంది. ఏమైనా.. తీవ్రత ఎక్కువగా ఉన్నా ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటం నిజంగా లక్కీగా చెప్పాలి.