Begin typing your search above and press return to search.

‘బుగాటీ’ కారు.. బుల్లెట్ మాదిరి స్పీడ్

By:  Tupaki Desk   |   3 March 2016 10:30 PM GMT
‘బుగాటీ’ కారు.. బుల్లెట్ మాదిరి స్పీడ్
X
2.5 సెకన్ల కాలం ఎంత? ఆ వ్యవధిలో ఒక కారు అందుకునే వేగం ఎంతో తెలుసా? అక్షరాల 100 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 420 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారుకు ఒక అరుదైన రికార్డు ఉంది. ఈ కారు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కారుగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ కారు పేరేమిటంటారా? అక్కడికే వస్తున్నాం. బుగాటీ చిరాన్ అన్న పేరుతో ఉండే ఈ కారు ప్రియుల కలల సుందరిగా అభివర్ణించొచ్చు.

1500 బీహెచ్ పీ పవర్ తో నడిచే ఈ కారు ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన.. వేగవంతమైన కారు కావటం గమనార్హం. దీని వేగాన్ని తట్టుకోవటం కోసం ప్రత్యేకంగా దీని టైర్లను తయారు చేయించారు. ఫార్ములా వన్ కార్లలో వాడే బ్రేకింగ్ వ్యవస్థను ఉపయోగించిన ఈ కారులో.. స్వల్ప వ్యవధిలో అత్యధిక స్పీడ్ ను అందుకోవటానికి వీలుగా టాప్ స్పీడ్ కీ ఉంటుందని చెబుతారు. దీన్ని వాడటం మొదలుపెడితేనే.. ఇది టాప్ స్పీడ్ తో దూసుకెళుతుందట.

ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ కారును సొంతం చేసుకోవటం అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఈ కారును కేవలం 500 మాత్రమే తయారు చేస్తున్నారు. ఇప్పటికే 180 కార్ల బుకింగ్ లు పూర్తి అయ్యాయి. విపరీతమైన డిమాండ్ ఉన్న కారును సొంతం చేసుకోవటానికి చేతిలో డబ్బులే కాదు.. అందుకు తగ్గ పరపతి ఉంటే తప్ప చేతికి రాదని చెబుతున్నారు. ఇంతకీ..ఈ కారు రేటు ఎంతంటే.. జస్ట్ రూ.19 కోట్లు మాత్రమే.