Begin typing your search above and press return to search.

సోము వీర్రాజుకు గాలి తీసేశాడు

By:  Tupaki Desk   |   4 Nov 2015 9:46 AM GMT
సోము వీర్రాజుకు గాలి తీసేశాడు
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నిత్యం కయ్యానికి కాలు దువ్వే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొద్ది కాలంలో మీడియాలో బాగా ఫోకస్ అవుతున్నారు. మొన్న ఎమ్మెల్సీ కాక మునుపు తన సొంత జిల్లాలోనూ అందరికీ తెలియని వీర్రాజు ఇప్పుడు నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ అందరికీ పరిచయమయ్యారు. పైగా ఆయనకు ఏపీ బీజేపీ పగ్గాలు కూడా ఇస్తారన్న ప్రచారం జరుగుతుండడం.. ఆయన కూడా తాను పవన్ కళ్యాణ్ కు స్నేహితుడినని చెప్పుకొంటుండడంతో ''ఓహో వీర్రాజు కూడా పెద్ద నేతేనన్నమాట'' అనుకునేవారు ఉన్నారు.

అయితే... సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది.. అంతకుముందు ఆయన పరిస్థితి ఏమిటి.. ఎమ్మెల్సీ అయిన తరువాత పరిస్థితి ఏమిటనేది చెప్పి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆయన గాలి తీసిపడేశారు. వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి రావడం చంద్రబాబు పెట్టిన భిక్షేనని విలేకరుల సమావేశం పెట్టి మరీ వెంకన్న అందరికీ చెప్పారు.

ఇటీవల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సోము వీర్రాజుపై బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి పదవి కోసమే వీర్రాజు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. కన్నా లక్ష్మీ నారాయణ - పురందేశ్వరి - కావూరి సాంబశివరావులు సోనియా గాంధీ ఏజెంట్లని... ఎన్నికల సమయానికి వారంతా తిరిగి కాంగ్రెస్‌ పార్టీలోనే చేరతారని అన్నారు. బీజేపీ అగ్రనేతలు ఈ ముగ్గురిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. టీడీపీకి బీజేపీ మిత్రపక్షం కావడం వల్లనే బీజేపీ నేతలు ఎన్ని మాట్లాడినా తాము ఊరుకుండిపోతున్నామన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు చరిష్మా వల్లనే తాము అధికారంలోకి వచ్చామన్నారు. సీఎం చంద్రబాబుకు మచ్చ తెచ్చేలా మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.

ఇటీవల కాలంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మంది బీజేపీ నేతలు వ్యతిరేకగళం వినిపిస్తున్నారని... నిత్యం విమర్శలు చేస్తున్ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఆ పదవి రావడానికి కారణం చంద్రబాబేనని వెంకన్న అన్నారు. ఈ లెక్కన చంద్రబాబు టిక్ పెడితేనే వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందని అర్థమవుతోంది. మరి అలాంటి వీర్రాజు ఎక్కువ చేస్తున్నారని... ఈసారి టిక్ కు బదులుగా చంద్రబాబు చెక్ పెట్టాలని టీడీపీ నేతలు అంటున్నారు.