Begin typing your search above and press return to search.

మండ‌లి... అస్త్ర స‌న్యాసం? ప్రాధాన్యం ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   26 Oct 2020 9:00 AM IST
మండ‌లి... అస్త్ర స‌న్యాసం?  ప్రాధాన్యం ఎక్క‌డ‌?
X
మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ ప్ర‌సాద్‌.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్న‌ట్టేనా? పార్టీకి - నియోజ‌కవ ‌ర్గానికి కూడా ఆయ‌న దూర‌మైన‌ట్టేనా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్‌ లో సుదీర్ఘ కాలం రాజ‌కీయాలు చేసిన కుటుంబంగా కృష్ణాజిల్లాలో పేరు తెచ్చుకున్న మండ‌లి కుటుంబం అదే రేంజ్‌ ను కోన‌సాగించారు. వివాదాల‌కు దూరంగా.. అవినీతి ఆరోప‌ణ‌లకు అత్యంత దూరంగా మెలిగిన కుటుంబంగా పేరు సంపాయించుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో టీడీపీ సైకిల్ ఎక్కిన మండ‌లి.. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు.

అనూహ్యంగా అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇచ్చి చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను గౌర‌వించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు వెంక‌ట్రామ్‌ కు టికెట్ ఇప్పించుకు నేందుకు ప్ర‌సాద్ ప్ర‌య‌త్నించారు. నిజానికి టీడీపీలోనే భారీ ఎత్తున పోటీ ఉంది. అయిన‌ప్ప‌టికీ బుద్ధ ప్ర‌సాద్ వంటి కీల‌క నాయ‌కుడు పార్టీలోకి వ‌చ్చిన నేప‌థ్యంలో బాబు ఆయ‌న‌కు టికెట్ ఇచ్చారు. ఇక‌, ఆయ‌న కుమారుడికి టికెట్ ఇవ్వ‌డంలో మాత్రం వెనుక‌డుగు వేశారు. ఒక‌టి జ‌గ‌న్ సునామీ ఎక్కువ‌గా ఉండ‌డం, వార‌సుల‌కు టికెట్లు ఇవ్వ‌డం ప్రారంభిస్తే.. కొన‌క‌ళ్ల నారాయ‌ణ కుమారుడుకి కూడా ఇవ్వాల్సి వ‌స్తుంది.

దీంతో బుద్ధ ప్ర‌సాద్ విజ్ఞ‌ప్తిని ప‌క్క‌న పెట్టి .. ఆయ‌న‌కే టికెట్ ఖ‌రారు చేశారు. ఇక‌, జ‌గ‌న్ సునామీలో ప్ర‌సాద్ ఓడిపోయారు. స‌రే! రాజ‌కీయ‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఓడిపోయినంత మాత్రాన నాయ‌కుల‌కు వ‌చ్చిన ఇబ్బంది లేదు. ముఖ్యంగా బుద్ధ ప్ర‌సాద్ వంటి నేత‌ల‌కు ఉండే ఇమేజ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఆయ‌న ఎందుకో.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఆయ‌న ప‌ర్య‌టించ‌డం లేదు. గ‌తంలో డిప్యూటీ స్పీక‌ర్‌ గా ఉన్న స‌మ‌యంలో కూడా అడ‌పా ద‌డ‌పా ప‌ర్య‌టించిన ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత‌.. త‌న‌కు సంబంధం లేద‌న్నట్టుగా దూరంగా ఉంటూ.. హైద‌రాబాద్‌ కే ప‌రిమిత‌య్యార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో టాక్‌.

ఇక‌, చంద్ర‌బాబు పార్టీ త‌ర‌ఫున అనేక సంద‌ర్భాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ విధానాల‌పై పోరాటాల‌కు పిలుపునిచ్చా రు. మిగిలిన కొంద‌రు నేత‌ల మాదిరిగానే బుద్ద ప్ర‌సాద్ కూడా బాబు ఆదేశాల‌ను పాటించ‌లేదు. పోనీ.. త‌న వార‌సుడినైనా రంగంలోకి దింపారా? అంటే .. అది కూడా లేదు. దీంతో చంద్ర‌బాబు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన పార్టీ ప‌ద‌వుల్లో కొత్త‌వారికి, వైసీపీ నుంచి వ‌చ్చిన వారికి కూడా ప‌ద‌వులు ఇచ్చినా.. బుద్ధ ప్ర‌సాద్‌కు మాత్రం చోటు క‌ల్పించ‌లేదు. దీంతో ప్ర‌సాద్ మ‌రింత‌గా పార్టీని దూరం పెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌నీసం ఇలాంటి వారికి పార్టీ పొలిట్ బ్యూరో అయినా ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేద‌ని అంటున్నా.. ఆయ‌న దూరంగా ఉన్న నేప‌థ్యంలో బాబు నిర్ణ‌య‌మే బెట‌ర్ అనేవారు కూడా ఉన్నారు. అదేస‌మ‌యం‌లో అవ‌నిగ‌డ్డ‌లో టీడీపీని బ‌తికించుకునేందుకు సంస్థాగ‌తంగా పార్టీకి అండ‌గా ఉంటున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. మండ‌లి అస్త్ర‌స‌న్యాసం చేయ‌డం, బాబు ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం రెండూ కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.