Begin typing your search above and press return to search.

ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్‌ఎఫ్‌ !

By:  Tupaki Desk   |   22 Aug 2020 6:00 PM IST
ఐదుగురు చొరబాటుదారులను  మట్టుబెట్టిన బీఎస్‌ఎఫ్‌ !
X
కుక్కతోక .. పాకిస్థాన్ బుద్ది ఒక్కటే అని మరోసారి నిజమైంది. పాక్ పై దాడి చేయకుండా సామరస్యంగా పోతుంటే , దాన్ని అలుసుగా తీసుకోని పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంటుంది. ఏ చిన్న అవకాశం దొరికినా కూడా దేశంలో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి ప్రయత్నించింది. అయితే , మన బార్డర్ సైన్యం .. చాకచక్యంగా వ్యవహరించి అక్రమంగా దేశంలోకి చొరబడిన ఐదుగురుని మట్టుబెట్టారు. శనివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ బోర్డర్‌ నుంచి భారత్‌ లోకి ప్రవేశించడానికి దుండగులు ప్రయత్నించారు. ఇంతవరకు ఇలా ప్రవేశించడానికి ప్రయత్నించిన వారిని ఇంత సంఖ్యలో కాల్చిచంపడం ఇదే ప్రధమం.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఈ ఘటనపై బీఎస్‌ ఎఫ్‌ అధికారులు మాట్లాడుతూ, ‘103వ బీఎస్ ‌ఎఫ్‌ ట్రూప్‌ సరిహద్దులో అనుమానాస్పద కదలికలను గుర్తించింది. వారిని దేశంలోకి ప్రవేశించకుండా అక్కడే ఆగమని ఆదేశించగా వారు బీఎస్‌ ఎఫ్‌ ట్రూప్ ‌పై కాల్పులు జరిపారు. దీంతో వారు కూడా ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. దుండగులు పెద్ద పెద్ద గడ్డి మోపులను అడ్డుపెట్టుకొని దేశంలోకి ప్రవేశించాలని చూశారు. వారి దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ సంఘటన శనివారం తెల్లవారు జామున 4:45 గంటల ప్రాంతంలో జరిగింది అని తెలిపారు. బీఎస్ ‌ఎఫ్‌ అధికారులు వారి వద్ద నుంచి ఒక ఏకే-47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దశాబ్ద కాలంలో... పాకిస్థాన్‌తో ఉన్న 3300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుల్లో... ఒకేసారి ఒకే ఘటనలో ఎక్కువ మందిని లేపేయడం ఇదే మొదటిసారి.