Begin typing your search above and press return to search.

తొలిసారి అంత ధైర్యంగా వెళ్లిన కవిత ఈసారి మాత్రం భర్తతో భావోద్వేగం!

By:  Tupaki Desk   |   20 March 2023 7:21 PM GMT
తొలిసారి అంత ధైర్యంగా వెళ్లిన కవిత ఈసారి మాత్రం భర్తతో భావోద్వేగం!
X
కొన్నిసార్లు జరిగేదేమిటన్న దానిపై ఫుల్ క్లారిటీ ఉన్నప్పటికీ.. లేనిపోని సందేహాల్ని వ్యక్తం చేసే అలవాటు కొన్ని మీడియా సంస్థల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీవ్ర ఆరోపణల్ని ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆమె విచారణకు హాజరవుతారా? లేదా? అన్న దానిపై పలు ప్రశ్నలు తలెత్తాయి. అయితే.. మెజార్టీ వర్గీయుల అంచనాల్ని నిజం చేస్తూ.. ఆమె ఈడీ ఎదుట హాజరయ్యారు.

నోటీసుల్లో పేర్కొన్నట్లుగా సమయానికి కాస్త ముందే ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. తొలిసారి ఈడీ ఎదుట విచారణకు వెళ్లే వేళలో.. పిడికిలి బిగించిన ఆమె.. తనలోని ఉద్యమ స్ఫూర్తిని రగిలించే తీరును ప్రదర్శిస్తూ లోపలకు వెళ్లటం.. విచారణ అనంతరం నవ్వులు చిందిస్తూ ఆమె బయటకు రావటం తెలిసిందే. తొలిసారి విచారణ పూర్తి అయిన వెంటనే మరోసారి ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేయటం.. అనంతరం పలు పరిణామాలు చోటుచేసుకోవటం తెలిసిందే.

ఎట్టకేలకు ఈ రోజు (సోమవారం) ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్ కూడా ఉన్నారు. ఈడీ ఆఫీసుకు వెళ్లే గేటుకు కాస్త మందు వరకు ఆమె భర్త అనిల్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రోదిపట్టుకొని ఊరడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కవిత భావోద్వేగానికి గురి కావటం గమనార్హం. తొలిసారి విచారణకు వెళ్లే వేళలో కనిపించిన ఆత్మవిశ్వాసం తాజాగా మాత్రం లోపలకు వెళ్లే వేళలో భావోద్వేగానికి గురి కావటాన్ని పలువురు ప్రస్తావించటం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.