Begin typing your search above and press return to search.

ఆ మహిళ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   28 March 2023 4:17 PM GMT
ఆ మహిళ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య ఓ సర్పంచ్ తో వివాదాల్లో చిక్కుకొని ఎంతగా అప్రతిష్టపాలు అయ్యాడో మనం చూశాం. అది మరిచిపోకముందే ఇప్పుడు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓ మహిళ నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం బీఆర్ఎస్ లో కలకలం రేపింది. ఈ క్రమంలోనే సదురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దీనిపై స్పందించాడు. మహిళ ఆరోపణలపై వివరణ ఇచ్చాడు.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న తాజాగా తనపై ఆరోపణలు చేసిన మహిళ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.  తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని.. ప్రతిపక్ష నాయకులతో కలిసి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్ లో ప్రచారం అవుతున్న వాట్సాప్ నంబర్ తనది కాదంటూ క్లారిటీ ఇచ్చారు. దీనిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

-మహిళ చేసిన ఆరోపణలు ఏమిటి?

ఓ మహిళ తాజాగా వీడియో విడుదల చేసి సంచలన రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నయ్య తనతో వాట్సాప్ చాట్ చేశాడని ఆమె ఆరోపించింది. ఆయన మోసాలను బట్టబయలు చేస్తానని తెలిపింది. బ్లాక్ మెయిల్ చేయడం లేదని.. ఎమ్మెల్యే ఇంటి సిసిటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయని తెలిపింది.

-బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ ఇదీ

'వాట్సాప్ లో ఉన్న నెంబర్ నాది కాదు. ఆ మహిళ చేసిన ఆరోపణలు వాస్తవం కాదు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేశారు. ఇది కొంతమంది చేస్తున్న రాజకీయ కుట్ర. కావాలనేనన్ను ఎన్నికల సమయంలో ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని ఇలా చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నా.. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా' అని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు.

కొంతమంది రైతుల నుంచి సుమారు రూ.60 -70 లోల వసూలు చేసి మోసం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులకు చెప్పి భారీ మోసాన్ని అరికట్టానని.. చీటింగ్ కేసు పెట్టించి పోలీసులతో నిందితులను జైలుకు పంపానని.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో వారు ఇలా బెదిరిస్తున్నారని చిన్నయ్య ఆరోపించారు. మొత్తంగా మహిళ వీడియో ప్రతిగా ఎమ్మెల్యే క్లారిటీతో ఈ వివాదంపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది.     


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.