Begin typing your search above and press return to search.

అలా ఓటేసినందుకు చాలా ఫీలవుతున్నారు

By:  Tupaki Desk   |   25 Jun 2016 7:34 PM IST
అలా ఓటేసినందుకు చాలా ఫీలవుతున్నారు
X
చారిత్రాత్మక తీర్పుతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన బ్రిటీషర్లు ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారట. దశాబ్దాల తరబడి సాగిన అనుబంధాన్ని వదులుకుంటూ.. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేందుకు ఓకే చెప్పేసిన ఫలితం మీద వారు కిందామీదా పడిపోతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా.. బ్రెగ్జిట్ మీద తాము ఇలాంటి తీర్పు ఇవ్వకుండా ఉండాల్సిందంటూ చెప్పుకోవటం ఇప్పుడు బ్రిటన్ లో కనిపిస్తోంది.

బ్రెగ్జిట్ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు మొత్తం అతలాకుతలం కావటం.. బ్రిటీషర్లు ఓపట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకీ తాము అలా ఓటు ఎందుకు వేశామా? అని వారు ఇప్పుడు తలలు పట్టుకోవటం కనిపిస్తోంది. గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా బ్రిటీష్ పౌండ్ పడిపోవటం.. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావటమే కాదు.. ఆస్తులు విలువ దిగజారిపోవటంతో బ్రిటీషర్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఇప్పట్లో బయటపడే ఛాన్స్ లేదంటూ ఆర్థిక వేత్తలు చెబుతున్న మాటలకు వారు వణికిపోతున్న పరిస్థితి.

బ్రెగ్జిట్ కు అనుకూంగా ఓటేసిన ఒక మహిళ మాట్లాడుతూ.. తాను సైతం విడిపోవటానికే ఓటు వేశానని.. ఓటు వేసి పొద్దున్నే లేచి చూసుకుంటే.. వాస్తవం చూసి మతి పోయిందని ఆమె వాపోయింది. తనకు మరోసారి అవకాశం ఇస్తే.. విడిపోయేందుకు తాను ఎంతమాత్రం ఒప్పుకోనని.. కలిసి ఉండేందుకే మొగ్గుచూపుతానని చెప్పటం గమనార్హం. మరి.. ఈ తెలివి ఓట్లు వేసే ముందంతా ఏమైపోయిందో..?