Begin typing your search above and press return to search.

షాకింగ్‌.. పాపీస్‌ అమ్మిన బ్రిటన్‌ ప్రధాని.. కారణం ఇదేనా!

By:  Tupaki Desk   |   4 Nov 2022 11:30 PM GMT
షాకింగ్‌.. పాపీస్‌ అమ్మిన బ్రిటన్‌ ప్రధాని.. కారణం ఇదేనా!
X
ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం, కోవిడ్‌ సృష్టించిన కల్లోలం, ఆర్థిక మాంద్యం తదితర కారణాలతో చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంలోకి జారుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అభివృద్ధి చెందిన యూరోప్‌ దేశాలు సైతం ఇదే బాట పడుతున్నాయి. జీ–7 దేశాల్లో ఒకటిగా ఉన్న బ్రిటనళ్‌ సైతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. ఈ కారణంతోనే ఇటీవల ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్న తన హోదాను భారత్‌కు కోల్పోయింది.

కాగా బ్రిటన్‌ జనాభాలో సగం మంది ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నారని వార్తలు వచ్చాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దలేక ప్రధాని బాధ్యతలు చేపట్టిన 45 రోజులకే లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేసేశారు. దీంతో భారత సంతతకి చెందిన హిందూ వ్యక్తి రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధాని అయిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నడుం బిగించారు. ఈ క్రమంలో ఆయన లండన్‌ వెస్ట్‌మినిస్టర్‌ ట్యూబ్‌ స్టేషన్‌లో ప్రయాణికులకు పాపీస్‌ అమ్మారు. ఓ ట్రేలో పాపీస్‌ను పెట్టుకుని ఆయన వేగంగా నడుస్తూ ప్రయాణికులకు పాపీస్‌ విక్రయించడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.

కొంతమంది బ్రిటన్‌ ప్రధాని వద్ద పాపీస్‌ కొనుగోలు చేశారు. వాటిని సెల్ఫీ తీసుకున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో సైతం పోస్టు చేశారు. రిషి సునాక్‌ చాలా నిరాడంబరంగా ఉన్నారని తెలిపారు.
లండన్‌ ట్యూబ్‌ స్టేషన్‌లో రిషి సునాక్‌తో చాలా మంది సెల్ఫీలు తీసుకుని, మాట్లాడారు. ఆయనతో సన్నిహితంగా మెలిగారు. లూయీస్‌ అనే ప్రయాణికుడు తన అనుభవాన్ని వివరిస్తూ.. రిషి సునాక్‌ చాలా నిరాడంబరంగా ఉన్నారని, ఆయనతో మాట్లాడటం సంతోషం కలిగించిందని పేర్కొన్నారు.

అయితే కొందరు మాత్రం రిషిని విమర్శిస్తున్నారు. చేయడానికి ఇంతకన్నా ఏం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. బ్రిటన్‌ ప్రధానిగా ఉంటూ ఫొటోలకు పోజులిచ్చే కార్యక్రమం ఏంటని ఎద్దేవా చేస్తున్నారు.

కాగా బ్రిటిష్‌ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, రాయల్‌ బ్రిటిష్‌ లెజియన్స్‌ యాన్యువల్‌ లండన్‌ పాపీ డే అపీల్‌ కోసం నిధులను సేకరించేందుకు రిషి సునాక్‌ పాపీస్‌ను విక్రయించారని తెలుస్తోంది. నిధుల సేకరణలో భాగంగా ఒక్కొక్క పాపీని 5 పౌండ్లకు విక్రయించారు. రిషి సునాక్‌తోపాటు బ్రిటిష్‌ సైన్యం, నావికా దళం, వాయుసేన సిబ్బంది, వలంటీర్లు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూడా పాపీస్‌ను విక్రయించారు.

మరోవైపు దేశ ప్రధానిగా ఉంటూ తన విలువైన సమయాన్ని కేటాయించి పాపీస్‌ అమ్మినందుకు, తమతోపాటు నిధి సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రిషి సునాక్‌కు రాయల్‌ బ్రిటిష్‌ లెజియన్‌ కృతజ్ఞతలు తెలియజేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.