Begin typing your search above and press return to search.
కరోనాతో పాటు ఎయిడ్స్ కట్టడికి ఇదే సరైన సమయం
By: Tupaki Desk | 6 May 2020 11:00 PM ISTకరోనా వైరస్‌తో మానవ ప్రపంచం తీవ్రంగా ప్రభావితమవుతోంది. ప్రజల రోజువారీ కార్యాచరణను పూర్తిగా మార్చేసింది. జీవన విధానమే మారిపోయింది. అయితే ఆ మార్పులు కొన్ని మేలు చేసేవి కూడా ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో హెచ్ఐవీ నివారణకు కరోనా అవకాశం కల్పించిందని తెలుస్తోంది. ఈ విషయాన్ని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ మాదిరే ఎయిడ్స్‌కి కూడా మందు లేదు. కరోనాతో పాటు ఎయిడ్స్‌పై కూడా పరిశోధనలు చేయాలని పలువురు సూచనలు చేస్తున్నారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో ఎయిడ్స్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం.. రెడ్ లైట్ ప్రాంతాల్లో గిరాకీ లేకపోవడం వంటి వాటితో ఆ వైరస్ తగ్గిపోయిందని గుర్తించారు.
లాక్‌డౌన్ ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో బయటి వ్యక్తులతో శృంగారంలో పాల్గొనడానికి అవకాశం లేదు. ఈ సమయంలో ఆ వైరస్ కేసులు తగ్గుముఖం పడ్డాయి. అయితే ఎయిడ్స్ నివారణకు ఇదే సరైన సమయని వైద్యులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరికి సెక్యూవల్లీ ట్రాన్సిమిటెడ్ ఇన్ఫెక్షన్స్ (Sexually Transmitted Infections- ఎస్టీఐ) పరీక్షలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ఇన్ఫెక్షన్స్ ఉన్నవారిని గుర్తించి ట్రీట్‌మెంట్ అందించగలిగితే హెచ్ఐవీ లేదా ఎయిడ్స్‌ను నివారించవచ్చునని బ్రిటీష్ అసోసియేషన్ ఫర్ సెక్సువల్ హెల్త్ & హెచ్ఐవీ ప్రతినిధులు చెబుతున్నారు. హెచ్ఐవీ లక్షణాలు ఉన్నా లేకపోయినా.. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తే ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తే తగ్గే అవకాశం ఉందని గుర్తుచేస్తున్నారు.
ప్రజలంతా ఇలా ఇళ్లకు పరిమితమైన అరుదైన సందర్భం ఎప్పుడూ రాదు. ఈ సమయాన్ని వైద్యానికి అనువుగా మార్చుకుని పలు వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. ఎస్‌టీఐలు ఉన్నవారి నుంచి మరొకరికి అది వ్యాప్తి చెందకుండా ఉండటం ఇప్పుడే సాధ్యమని గుర్తుచేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతీ ఒక్కరికీ టెస్టులు చేస్తే హెచ్ఐవీ వ్యాప్తి చెందకుండా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ విధానాన్నే కొన్ని దేశాల్లో ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలోనూ అందరికీ పరీక్షలు చేస్తే చాలా వ్యాధులు బయటపడి వారికి చికిత్స అందించే అవకాశం ఉందని గుర్తుచేస్తున్నారు. ఈ చర్యతో ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ విషయాలనే ప్రపంచ దేశాలకు గుర్తుచేస్తున్నారు.