Begin typing your search above and press return to search.

వండర్: సిగరెట్ కంపెనీ నుంచి కరోనా వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   16 May 2020 11:50 AM GMT
వండర్: సిగరెట్ కంపెనీ నుంచి కరోనా వ్యాక్సిన్
X
కరోనా వైరస్ పై ప్రపంచమంతా పోరాడుతోంది. మేధావులైన సైంటిస్టులతోనే దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడం సాధ్యం కావడం లేదు. అగ్రరాజ్యం అమెరికా సైతం విలవిలలాడుతోంది. ఈ మహమ్మారికి విరుగుడు లేక లక్షలమంది ప్రాణాలు పోతున్నాయి. అయితే ఎన్నో ఫార్మా కంపెనీలు, వివిధ దేశాల ప్రొఫెసర్లు, సైంటిస్టుల వల్ల కానిది తాజాగా ఓ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సిగరెట్ తయారీ కంపెనీ వల్ల అవుతుందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే తాజాగా ఈ అతిపెద్ద సిగరెట్ తయారీ కంపెనీ ‘బ్రిటీష్ అమెరికన్ టొబోకో’ కంపెనీ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొని టెస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించడం సంచలనమైంది.

తాజాగా ‘బ్రిటీష్ అమెరికన్ టొబోకో’ సిగరెట్ కంపెనీ తాము కరోనాకు విరుగుడుగా వ్యాక్సిన్ కనుగొన్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం అది టెస్టింగ్ దశలో ఉందని తెలిపింది. దీని తయారీ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ వ్యాక్సిన్ ను పొగాకు ఆకుల నుంచి సేకరించిన ప్రొటీన్స్ ను మనిషిపై ప్రయోగం చేసేందుకు సిద్ధం చేశారు. క్లినికల్ ట్రయల్స్ లో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లు పరిశోధనల్లో తేలింది. ఈ వ్యాక్సిన్ కు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆమోదం లభిస్తే తొలి దశ టెస్టింగ్ ట్రయల్స్ ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది.

అయితే పొగాకు ఆకుల నుంచి కరోనా వ్యాక్సిన్ కనుగొంటామని ఏప్రిల్ లో ప్రకటించిన సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇది వట్టి ఫేక్ అని కొట్టిపారేసిన వారు ఉన్నారు. 18 నెలల వరకు పట్టే వ్యాక్సిన్ ను ఈ సిగరెట్ కంపెనీ తయారు చేయడం అసాధ్యమని సైంటిస్టులు చెబుతున్నారు.

అయితే ఎఫ్డీఏకు అప్రూవల్ కోసం దరఖాస్తు పెట్టుకున్నట్టు సిగరెట్ సంస్థ తెలిపింది. దానికి ఎఫ్.డీ.ఏ కూడా తమకు దరఖాస్తు అందిందని తెలిపింది. దీంతో ఈ సిగరెట్ కంపెనీ షేర్ల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది.