Begin typing your search above and press return to search.

ఆ ఎయిర్ లైన్స్ గూబ గుయ్య‌మ‌నేలా జ‌రిమానా!

By:  Tupaki Desk   |   9 July 2019 4:53 AM GMT
ఆ ఎయిర్ లైన్స్ గూబ గుయ్య‌మ‌నేలా జ‌రిమానా!
X
ప్ర‌ముఖ ఎయిర్ లైన్స్ సంస్థ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ కు రూ.1650 కోట్ల జ‌రిమానాను విధించారు. ఇంత భారీ మొత్తాన్ని ఫైన్ రూపంలో ఎందుకు వేశారో తెలిస్తే అవాక్కుఅవ్వాల్సిందే. ల‌క్ష‌లాది మంది వినియోగ‌దారులు బ్రిటిష్ ఎయిర్ లైన్స్ సంస్థ వెబ్ సైట్ కు వెళ్లే ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వారు న‌కిలీ వెబ్ సైట్ లోకి వెళ్లారు. అలా వెళ్ల‌టానికి కార‌ణం స‌ద‌రు ఎయిర్ లైన్స్ సంస్థ అప్ర‌మ‌త్తంగా ఉండ‌క‌పోవ‌టమేన‌న్న‌ది ఆరోప‌ణ‌.

ఎయిర్ లైన్స్ సంస్థ వెబ్ సైట్ లో సేవ‌లు పొందేందుకు వెళ్లే క్ర‌మంలో న‌కిలీ వెబ్ సైట్ లోకి వెళ్లిన దాదాపు 5 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులు త‌మ వ్య‌క్తిగ‌త డేటా (క్రెడిట్ కార్డు.. డెబిల్ కార్డు వివ‌రాల్ని) ను అందులో పొందుప‌ర్చారు. దీంతో స‌ద‌రు వినియోగ‌దారులు భారీగా న‌ష్ట‌పోయారు. ఈ నేప‌థ్యంలో బ్రిటిష్ ఎయిర్ లైన్స్ సంస్థ‌కు భారీ జ‌రిమాన‌ను వేసింది బ్రిట‌న్ డేటా నియంత్ర‌ణ సంస్థ‌. కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం ఈ ఫైన్ విధించారు.

త‌మ వెబ్ సైట్ హ్యాకింగ్ బారిన ప‌డినట్లు బ్రిటిష్ ఎయిర్ వేస్ గ‌త సెప్టెంబ‌రులో ప్ర‌క‌టించింది. వినియోగ‌దారులు న‌మ్మ‌కంతో ఉన్న‌ప్పుడు వారి న‌మ్మ‌కాన్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని.. పౌరుల స‌మాచారాన్ని సేక‌రిస్తున్న‌ప్పుడు.. పూర్తి బాధ్య‌త వ‌హించాల‌ని కోరింది. డేటా ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త నిబంధ‌న‌ల్ని ఐరాపో స‌మాఖ్య అమ‌ల్లోకి తెచ్చిన ఏడాదిలో తాజా ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

ఇదిలా ఉంటే.. అంత పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థ‌కు సంబంధించిన డేటా సంర‌క్ష‌ణకు సంబంధించి బీఏ భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పేల‌వంగా ఉన్నాయ‌ని గుర్తించారు. పేరు.. చిరునామా.. ప్ర‌యాణ‌తేదీ వివ‌రాలు.. లాగిన్ వివ‌రాలు.. కార్డుల వివ‌రాలు సుల‌భంగా అక్ర‌మార్కుల‌కు చేరేలా ఉన్నాయి. దీంతో.. భారీ జ‌రిమానాను విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ డేటా సంర‌క్ష‌ణ‌లో ఫెయిల్ అయిన కంపెనీల‌కు విధించిన భారీ ఫైన్ లో బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థే మొద‌టిద‌ని చెబుతున్నారు.