Begin typing your search above and press return to search.

ప్రపంచ వ్యాప్తంగా ఆ విమాన సంస్థ సర్వీసులు క్యాన్సిల్

By:  Tupaki Desk   |   9 Sep 2019 9:06 AM GMT
ప్రపంచ వ్యాప్తంగా ఆ విమాన సంస్థ సర్వీసులు క్యాన్సిల్
X
ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన విమాన సర్వీసుల్లో అగ్రగామి అయిన బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థ సంచలన ప్రకటన చేసింది. జీతాల మార్పు విషయానికి సంబంధించి నూతన పారిశ్రామిక విధానాన్ని ఈ సంస్థకు చెందిన ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త విధానాల మీద ఆగ్రహంతో ఉన్న ఎయిర్ లైన్స్ సిబ్బంది 48 గంటల సమ్మెకే పిలుపునిచ్చారు.

దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటిష్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన అన్ని సర్వీసుల్ని రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో.. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. బ్రిటిష్ ఎయిర్ లైన్స్ చరిత్రలో పైలట్లు తొలిసారి సమ్మె చేశారని చెబుతున్నారు.

ఇంతకీ సంస్థకు.. పైలట్లకు మధ్యనున్న విభేదాల్లోకి వెళితే.. ఎయిర్ లైన్స్ లోని లాభాన్ని ఉద్యోగులకు పంచాలని బ్రిటిష్ ఎయిర్ లైన్స్ పైలట్స్ అసోసియేషన్ వాదిస్తోంది. అయితే.. ఉద్యోగుల సమ్మె న్యాయబద్ధం కాదని.. తాము సరైన ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా సంస్థ చెబుతోంది. సంస్థ.. ఉద్యోగుల సంగతి ఎలా ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా సర్వీసులు నిలిచిపోయిన కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావటమే కాదు.. ప్రత్యామ్నాయ విమానాల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుందని చెప్పక తప్పదు.