Begin typing your search above and press return to search.

కరోనా కొత్త రూపం బ్రిటన్ లో ఎలా బయటపడింది?

By:  Tupaki Desk   |   22 Dec 2020 8:10 AM GMT
కరోనా కొత్త రూపం బ్రిటన్ లో ఎలా బయటపడింది?
X
దాదాపు ఏడాది క్రితం కరోనా బయటపడినప్పుడు ప్రపంచం మొదట పెద్దగా పట్టించుకున్నది లేదు. ఎప్పుడైనా చైనాలోని వూహాన్ లో పరిస్థితులు దారుణంగా మారిపోయి.. అంత పెద్ద వూహాన్ లో శశ్మాన నిశ్శబ్ధాన్నిప్రపంచం కాస్త ఆలస్యంగా అర్థం చేసుకుంది. ఒకసారి చేదు అనుభవం ఎదురయ్యాక.. అప్రమత్తత పెరుగుతుంది. తాజాగా బ్రిటన్ ఎపిసోడ్ ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. కరోనా వైరస్ కొత్త రూపు మార్చుకున్న వైనాన్ని బ్రిటన్ లో గుర్తించటం.. అది మనకు తెలిసిన కరోనాకు మించిన వేగంతో విస్తరిస్తున్న వైనాన్ని గుర్తించారు.

దీంతో.. అలెర్టు అయిన బ్రిటన్ ప్రభుత్వం.. కొత్త వైరస్ వివరాల్ని వెల్లడించింది. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. అంతే.. ప్రపంచ దేశాలన్ని అలెర్టు అయిపోతున్నాయి. బ్రిటన్ తో తమకున్న రవాణా సౌకర్యాల్ని రద్దు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. విషాదం ఏమంటే.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిందన్న సంతోషం తాజా పరిణామాలతో ఆవిరైంది. మరింత చిత్రమైన విషయం.. కరోనాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు అన్ని పరీక్షల తర్వాత అనుమతి ఇచ్చిన బ్రిటన్ లోనే.. కొత్త రూపు బయటపడటం గమనార్హం.

ఇంతకీ కరోనా కొత్త రూపును బ్రిటన్ లో ఎలా గుర్తించారు? అన్న వివరాల్లోకి వెళ్లే ముందు.. కొత్త రూపులోకి వచ్చిన వైరస్ ను ఏమని పిలుస్తున్నారన్న విషయంలోకి వెళితే.. దీన్ని వీయూఐ 20212/01 అని వ్యవహరిస్తున్నారు. కొత్త వైరస్ ను పరీక్షించగా.. కోవిడ్ వైరస్ లో 23 జన్యు మార్పులు జరిగినట్లుగా గుర్తించారు. ఇదిగత అక్టోబరులో లండన్ లో గుర్తించారు. కాకుంటే.. డిసెంబరు నాటికి వేగంగా వ్యాపిస్తోందన్న విషయం బయటకు వచ్చింది. ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఈ కొత్త రూపుతో ఉన్న వైరస్ బ్రిటన్ లో మాత్రమే కాదు.. యూరప్ లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాతో సహా పలు చోట్ల కనిపిస్తున్నాయి. దీని వేగం ఎంతలా ఉందంటే.. బ్రిటన్ లో ఈ నెల ఎనిమిదిన 12,282 కేసులు నమోదైతే.. 21 నాటికి 33,364 కేసులు నమోదంది.