Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. బ్రిటన్ ప్రధాని పోస్ట్ ఊస్ట్ కాలేదు!

By:  Tupaki Desk   |   7 Jun 2022 9:00 AM GMT
హమ్మయ్యా.. బ్రిటన్ ప్రధాని పోస్ట్ ఊస్ట్ కాలేదు!
X
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు తాత్కాలికంగా గండం గట్టెక్కినట్లయింది. ఆయనపై తాజాగా పెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గారు. సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ 211 ఓట్లతో గెలిచారు. అవిశ్వాసంలో నెగ్గడానికి జాన్స్ న్ కు 54 ఓట్లు అవసరం. సోమవారం పార్లమెంట్ లో పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బోరిస్ కు అనుకూలంగా 211 ఓట్లు రావడంతో గెలిచారు. అవిశ్వాస తీర్మానంలో బోరిస్ నెగ్గినా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ అవిశ్వాస తీర్మాన ఓటింగ్లో సొంత పార్టీకి చెందిన 148 మంది ఎంపీలు ఓటు వేయలేదు. దీంతో ఆయన సొంత కుంపటిని చల్లార్చినప్పుడే అసలైన విజయమని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

కరోనా కారణంగా సామాజిక సమావేశాలను పరిమితం చేసిన ఆయన డౌనింగ్ స్ట్రీట్ లో ఈవెంట్లకు మాత్రం అవకాశం ఇచ్చారు. అంతకుముందు కూడా డౌనింగ్ స్ట్రీట్ లోని తన వ్యక్తిగత నివాసాన్ని పునరుద్ధరించడానికి రహస్యంగా విరాళాలు సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఇలాంటి పలు కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొన్న బోరిస్ సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానిపై అనేక ఫిర్యాదులు వచ్చినట్లు ఎంపీలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పార్టీగేట్, బ్రెక్జిట్ గురించి మాట్లాడినప్పుడు జాన్సన్ ధిక్కార స్వరంతో ఉన్నారు. దీంతో ఆయనను గద్దె దించాలన్నంత వ్యతిరేకత ఏర్పడింది.

ఈ క్రమంలో జాన్సన్ పై ఈనెల 6న సోమవారం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటన్ పార్లమెంట్లో మొత్తం 650 సభ్యుల సంఖ్య ఉండగా కన్జర్వేటివ్ పార్టీ తరుపున 359 మంది ఉన్నారు. తాజాగా ఆయన అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కినప్పటికీ సొంత పార్టీ నుంచి వ్యతిరేకతను మాత్రం ఎదర్కొంటున్నారు.

ఇప్పటికే 148 మంది అవిశ్వాస ఓటింగ్ నుంచి తప్పుకోవడంతో వారంతా బోరిస్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే జాన్సన్ తప్పుకుంటే ఎవరిని ప్రధానిని చేయాలనే చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో రాజకీయ గందరగోళం ఏర్పడింది.

అయితే సొంత పార్టీలో ఉన్న అసమ్మతి చల్లార్చితే మరో ఏడాది వరకు బోరిస్ కు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఆయన అప్పటి వరకు కొనసాగేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడోనన్న ఆసక్తి నెలకొంది. గతంలో కంగే జాన్సన్ ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కుంభకోణాలు, అవినీతికి పాల్పడ్డారని సొంత పార్టీకి చెందిన వారే ఆరోపిస్తుండడం గమనార్హం. మరి ఆయన వీటి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తాడో చూడాలి.