Begin typing your search above and press return to search.

ట్రంప్ కోసం అలాంటి ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌

By:  Tupaki Desk   |   24 April 2017 4:18 AM GMT
ట్రంప్ కోసం అలాంటి ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌
X
నోటి దురుసుత‌నంతో ఇష్టారాజ్యంగా మాట్లాడే అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడు ప్ర‌త్యేకంగా ఎవ‌రికి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రి మీద‌నైనా ఇట్టే విరుచుకుప‌డుతూ.. హ‌డ‌లెత్తించే ట్రంప్‌ కు ఒక్క విష‌యంలో మాత్రం తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటార‌ట‌. మిగిలిన విష‌యాల్లో క‌నిపించ‌ని వ‌యోభారంగా ఒక్క విష‌యంలో మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెబుతారు.

అమెరికా అధ్య‌క్షుల వారికి మెట్లు ఎక్క‌ట‌మంటే చుక్క‌లు క‌నిపిస్తాయ‌ట‌. ఆ మాట‌కు వ‌స్తే.. ఆయ‌న‌కు మెట్లు ఎక్క‌టం మ‌హా భ‌య‌మ‌ట‌. అందుకే.. ఫారిన్ టూర్లు వెళ్లాల్సి వ‌స్తే.. అమెరికా అధికారులు ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పులు ఎదుర‌వుతున్నాయ‌ట‌. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో ట్రంప్ వారు మెట్లు ఎక్కే అంశం లేకుండా ఉండేలా ప్ర‌త్యేక ప్లాన్లు వేయాల్సి వ‌స్తోన్న‌ట్లు చెబుతున్నారు. దీంతో.. ఫారిన్ టూర్ల‌కు ట్రంప్ రెఢీ అయితే.. అధికారుల‌కు మాత్రం చుక్క‌లు క‌నిపిస్తున్నాయ‌ట‌. దేశంలో అయితే.. త‌మ‌కు తోచిన‌ట్లుగా ఏర్పాట్లు చేయొచ్చు. కానీ.. విదేశాల్లో మెట్లు ఎక్కే ప‌రిస్థితి ఎదురు కాకుండా చూడ‌టం ఇబ్బందిక‌రంగా మారింద‌ట‌.

ఈ ఏడాది అక్టోబ‌రులో బ్రిట‌న్ ప‌ర్య‌టించ‌నున్న ట్రంప్ కోసం.. ఇప్ప‌టి నుంచి అమెరికా అధికారులు కిందామీదా ప‌డుతున్నార‌ట‌. ఆయ‌న వెళ్లే ప్ర‌దేశాలు.. అక్క‌డ మెట్లు ఎక్కే అవ‌స‌రం ఉందా? లేదా? అని నిశితంగా ప‌రిశీలిస్తున్నార‌ట‌. ట్రంప్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చాలా ప్రాంతాల్లో మెట్లు ఎక్కే అవ‌స‌రం లేకుండా సిద్ధం చేస్తున్న అధికారులు.. బ‌కింగ్ హామ్ ప్యాలెస్ లో ఎలిజ‌బెత్ రాణి ఇచ్చే విందుకు ట్రంప్ హాజ‌రు కానున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మెట్లు ఎక్కాల్సిన ప‌రిస్థితి. దీన్ని ఎలా అధిగ‌మించాలా? అన్న‌ది ఇప్పుడు అర్థం కావ‌టం లేద‌ట‌. ట్రంప్ న‌డిచే దారిలో మెట్లు ఎక్కే అవ‌స‌రం రాకుండా ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్న అమెరికా అధికారులు.. బ‌కింగ్ హామ్ ప్యాలెస్ విష‌యంలో ఏం చేస్తార‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింద‌ట‌. అంద‌రిని హ‌డ‌లెత్తించే ట్రంప్ లో మెట్ల కోణం ఆస‌క్తిక‌రంగా లేదూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/