Begin typing your search above and press return to search.
ఈయూ నుండి ఎగ్జిట్ ...స్వసంత్ర దేశంగా బ్రిటన్!
By: Tupaki Desk | 30 Jan 2020 2:14 PM ISTబ్రిటన్ చరిత్ర లో ఇదొక కీలక సమయం అని చేయప్పవచ్చు. మరికొద్ది గంటల్లోనే బ్రిటన్ ఈయూ నుంచి బయటకి వచ్చి, ఒక స్వసంత్ర్య దేశంగా మారబోతుంది. ఈ మేరకు యూరోపియన్ పార్లమెంట్ కూడా బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. ఇంతకుముందే ప్రధాని బోరిస్ జాన్సన్, బ్రిటన్ పార్లమెంట్, క్వీన్ ఎలిజబెత్ 2..బ్రెగ్జిట్ కు గ్రీన్ సిగ్నలిచ్చేశారు. దీనితో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ రేపు వైదొలగనుంది.
బ్రెగ్జిట్ కు సంబంధించి ఈయూ తో కుదుర్చుకున్న ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ 330-231 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది. ఆ తరువాత ఈ ఒప్పందానికి ఎగువ సభ కూడా ఆమోద ముద్ర వేయడం తో బ్రిటన్ స్వసంత్ర దేశంగా ఏర్పడబోతోంది. ఇక పోతే , దాదాపు 50 ఏళ్ల పాటు ఈయూలో కొనసాగిన బ్రిటన్ ఇక నుంచి స్వతంత్రంగా ఉండనుంది. నిన్న ఈయూలో జరిగిన చర్చ సందర్భంగా చట్ట సభ్యులందరూ భావోద్వేగానికి గురయ్యారు. 50 ఏళ్ల తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం 621-49 తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందానికి ఆమోదం తెలిపారు. ఆల్డ్ లాంగ్ సైన్ అనే సంప్రదాయ పాటతో బ్రిటన్ కు వీడ్కోలు పలికింది ఈయూ పార్లమెంట్.
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ బ్రెగ్జిట్ అజెండా తోనే పదవీ బాధ్యతలు చేపట్టిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఎట్టకేలకి తన పంతాన్ని అయితే నెగ్గించుకున్నారు. ఈయూ నుంచి వైదొలిగేందుకు గట్టి పట్టుదలతో కృషి చేసి సాధించారు. 2018లో అప్పటి ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ కు చర్చలు జరిపినా దిగువసభ తిరస్కరించడం తో రాజీనామా చేశారు. ఆ తర్వాత పీఠమెక్కిన బోరిస్, సభలో మెజారిటీ లేకపోవడంతో ఎన్నికలకు వెళ్లారు. సంపూర్ణ మెజారిటీ తో మళ్లీ ప్రధాని బాధ్యతలు చేపట్టి బ్రెగ్జిట్ తన కలను సాకారం చేసుకున్నారు.