Begin typing your search above and press return to search.

కరోనా భారిన పడ్డ బ్రిటిష్ ఆరోగ్యమంత్రి !

By:  Tupaki Desk   |   11 March 2020 11:16 AM IST
కరోనా భారిన పడ్డ బ్రిటిష్  ఆరోగ్యమంత్రి !
X
కరోనా వైరస్ ... చైనా లోని వూహన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం ఖండంతరాలు దాటి విస్తరిస్తోంది. ఇప్పటికి దాదాపుగా 120 దేశాలలో విస్తరించిన కరోనా వల్ల 4 ,299 మంది చనిపోయారు.లక్షమందికి పైగా ఈ కరోనా వైరస్ సోకింది. తాజాగా ఈ లిస్ట్ లో బ్రిటన్ వైద్యారోగ్య జూనియర్ మంత్రి నాడిన్ డోరీస్‌ కూడా చేరారు. తాజాగా ఆమెకి కూడా కరోనా సోకినట్టు వైద్యులు వెల్లడించారు.

డోరీస్‌ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందనే విషయం కలవరానికి గురిచేసింది. వైద్యారోగ్యశాఖ మంత్రికి వైరస్ సోకడంతో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు. ఈ నేపథ్యం లో ఆమె మాట్లాడుతూ .. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని.. తన ఇంటిలోనే ఐసోలేషన్ వార్డులో ఉన్నట్టు, ఇంగ్లాండ్ ఆరోగ్య, తన పార్లమెంటరీ కార్యాలయ సిబ్బంది సలహా తో నడుచుకుంటున్నాననిఒక ప్రకటనలో తెలిపింది.
డోరీస్‌ కు కరోనా వైరస్ సోకిందని మంగళవారం నిర్ధారణ కాగా.. ఆమె అంతకుముందే పార్లమెంట్ సమావేశం లో వేలాది మంది ప్రజలను కలుసుకొన్నారని టైమ్స్ రిపోర్ట్ చేసింది.

బ్రిటీష్ వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మంత్రి డోరీస్ ఎక్కడ కరోనా వైరస్ బారిన పడ్డారు, ఆమె గత వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారో తెలుసుకునేందుకు బ్రిటన్ వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్‌ తో పోరాడటానికి మంత్రి డోరీస్ చట్టాన్ని రూపొందించి, అదే వైరస్ బారిన ఆమె పడటం కలవరం రేపింది. కన్జర్వేటివ్ ఎంపీ, వైద్యశాఖ మంత్రి అయిన డోరీస్ గత వారం రోజుల్లో యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌ తో సహా వందలాది మందితో సన్నిహితం గా మెలిగారని బ్రిటన్ వైద్యాధికారులు చెప్పారు. కరోనా వైరస్ చికిత్సకు బీమా కంపెనీల రక్షణ కల్పిస్తూ మంత్రి డోరీస్ జారీ చేసిన ఆదేశాల్లో సంతకం చేశారు. డోరిస్‌కు కరోనా పాజిటివ్ సోకడం బాధాకరమని వైద్యారోగ్యశాఖ మంత్రి మాట్ హన్‌కాక్ ట్వీట్ చేశారు. వైరస్ సోకిన వెంటనే తాను సెల్ఫ్ ఐసోలేటెడ్ వార్డులో ఇంటిలో ఉండటం మంచి చర్య అని అభివర్ణించారు.