Begin typing your search above and press return to search.
మాక్ డ్రిల్.. బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ చావుకొచ్చింది
By: Tupaki Desk | 7 Feb 2020 4:20 PM ISTవిశాఖలోని ఒక స్టార్ హోటల్ లో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ కుటుంబంతో కలిసి బస చేశారు. గురువారం ఉదయం ఫ్లెమింగ్ రిసెప్షన్ వద్ద ఉండగా.. ఆయన ఎదురుగానే బాంబు పేలింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆయన రిసెప్షన్ వెనుకాల వెళ్లి దాక్కున్నారు.
అయితే బాంబు పేలగానే కమాండోలు రావడం.. చుట్టుముట్టడం.. హంగామా చేయడం జరిగిపోయింది. ఇది ఉగ్రవాదులు చొరబడితే ఎదుర్కొనే మాక్ డ్రిల్ అంట.. హోటల్ నిర్వాహకులకు ముందే చెప్పారు. అయితే అనుకున్న సమయం కంటే ముందే ఈ మాక్ డ్రిల్ నిర్వహించడంతో హోటల్లోని వారిని అలెర్ట్ చేయలేకపోయారు.
కానీ నిజంగానే ఉగ్రవాదుల దాడి అనుకొని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్ దాక్కొని భయంతో వణికిపోయాడు. హోటల్ సిబ్బంది నవ్వి ఇదంతా వట్టి మాక్ డ్రిల్ అనడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే డీజీపీకి ఫోన్ చేసి తనకు గుండె జబ్బు ఉందని.. ఏదైనా అయితే మీరే బాధ్యత వహిస్తారంటూ నిలదీశారట.. ఇలా బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ ను మాక్ డ్రిల్ తో మనవాళ్లు బెంబేలెత్తించిన తీరు వివాదాస్పదమైంది.